హ్యూస్టన్ (Houston), అక్టోబర్ 17, 2026: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ హ్యూస్టన్ (TAGH) ఆధ్వర్యంలో అక్టోబర్ 17వ తేదీ శనివారం నిర్వహించిన బతుకమ్మ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. తెలంగాణ సంస్కృతి (Culture), సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ వేడుకలకు 6 వేల మందికి పైగా తెలుగు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని ఘనవిజయం (Grand Success) చేశారు.
రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలు, మహిళల సంప్రదాయ వస్త్రధారణ, బతుకమ్మ పాటలు, ఆటపాటలతో వేడుక ప్రాంగణమంతా తెలంగాణ పండుగ శోభను సంతరించుకుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు కుటుంబ సమేతంగా పాల్గొని బతుకమ్మ (Bathukamma) సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. వేలాది మంది మహిళలు ఒకేచోట చేరి బతుకమ్మ ఆడటం ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ మహోత్సవానికి ఈవెంట్ గ్రాండ్ స్పాన్సర్లుగా (Grand Sponsors) శ్రీమతి మాలతి, శ్రీ దేవేందర్ రెడ్డి దారం దంపతులు అందించిన ఉదారమైన సహకారం కార్యక్రమ విజయానికి ఎంతో దోహదపడింది. తెలంగాణ సంస్కృతి పరిరక్షణకు వారు అందిస్తున్న ప్రోత్సాహాన్ని TAGH కార్యవర్గం ప్రత్యేకంగా అభినందిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు (Heartfelt thanks)తెలియజేసింది.
అలాగే మహాప్రసాదం స్పాన్సర్లుగా శ్రీమతి సురేఖ – శ్రీ శ్రీనివాస్ మెట్టు దంపతులు, శ్రీమతి పద్మ – శ్రీ వీరేందర్ రెడ్డి దేవిరెడ్డి దంపతులు అందించిన సహకారంతో వేలాది మంది భక్తులకు మహాప్రసాదం అందజేశారు. వారి సేవా దృక్పథాన్ని, ఉదారతను TAGH నాయకత్వం ప్రత్యేకంగా కొనియాడింది. ఈ భారీ వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో ఈవెంట్ కోఆర్డినేటర్లు (Coordinators) సుమీత్ అలేటి, సరిత తోట కీలక పాత్ర పోషించారు.
కార్యక్రమ ప్రణాళిక, ఏర్పాట్లు, వాలంటీర్ల సమన్వయం, అతిథుల సౌకర్యాలు తదితర అంశాల్లో వారు చూపిన అంకితభావం ప్రశంసనీయం. TAGH (Telangana Association of Greater Houston) ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యులు (Executive Board Members) క్రాంతి నేదునూర్, సురేష్ గోవిందు, సుమీత్ అలేటి, వెంకట్ గార్లపాటి, రాజేష్ గంప, సంతోష్ డేమె, చందు మాదిరెడ్డి, ఉదయ్ మరుపాకుల సమష్టి కృషి, సమన్వయంతో ఈ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అలాగే TAGH పూర్వ అధ్యక్షులు కోటి కూన్రెడ్డి అందించిన సహకారం, ప్రోత్సాహానికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు (Special Thanks) తెలియజేశారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు శ్రీధర్ పగిడి, నారాయణ రెడ్డి ఇందూర్తి, సువీన్ మడుగుల, సూర్య బంగ్లా అందించిన మార్గదర్శకత్వం, సహకారం ఈ కార్యక్రమ విజయానికి మరింత బలాన్నిచ్చాయి. బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ సభ్యులు వీరేందర్ దేవిరెడ్డి, శ్రీధర్ తోట, రాజశేఖర్ గుత్తా, విజయ్ దేవిరెడ్డి అందించిన విలువైన సలహాలు, ప్రోత్సాహానికి TAGH ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ మహోత్సవానికి ఆర్థికంగా (Financial), సేవాపరంగా (Service) సహకరించిన దాతలు, స్పాన్సర్లు, జీవితకాల సభ్యులు, శ్రేయోభిలాషులు, వాలంటీర్లు, మీడియా ప్రతినిధులు, వివిధ తెలుగు సంఘాల నాయకులు, కమ్యూనిటీ సభ్యులందరికీ TAGH (Telangana Association of Greater Houston) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. ముఖ్యంగా కార్యక్రమ విజయానికి అహర్నిశలు శ్రమించిన వాలంటీర్ల సేవలను ప్రత్యేకంగా అభినందించింది.
దాతల ఉదారత, వాలంటీర్ల అంకితభావం, ప్రజల అపూర్వ స్పందనతో TAGH (Telangana Association of Greater Houston) బతుకమ్మ 2026 హ్యూస్టన్ తెలుగు సమాజ చరిత్రలో చిరస్మరణీయమైన వేడుకగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను (Traditions) పరిరక్షిస్తూ, తెలుగు ప్రజల మధ్య ఐక్యతను (Unity) మరింత బలోపేతం చేసే దిశగా భవిష్యత్తులోనూ మరిన్ని సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను నిర్వహించేందుకు TAGH కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.