Connect with us

Education

కర్నూలు పాఠశాలకు సైన్స్ ల్యాబ్ పరికరాలు, మెటీరియల్: రవి పొట్లూరి, తానా 23వ మహాసభల కన్వీనర్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) సహకారంతో ఆంధ్రప్రదేశ్, రాయలసీమలోని కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జనవరి 6న మైక్రోస్కోప్ పరికరాలు, పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ తానా 23వ మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి అందించారు.

విద్యార్థులకు బోధనా పరికరాలు, కంప్యూటర్లు అందించవల్సిందిగా తానా 2023 మహాసభల (Conference) కన్వీనర్ రవి పొట్లూరి ని అభ్యర్థించగా, వెంటనే స్పందించి మైక్రోస్కోపులు, స్టడీ మెటీరియల్స్ అందించారని, కంప్యూటర్లని కూడా పది రోజుల్లో అందిస్తామని తెలిపారని పాఠశాల బయాలజీ ఉపాధ్యాయులు గోకారి తెలిపారు.

కప్పట్రాళ్ల విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించడానికి కృషి చేస్తామని, పాఠశాల విద్యార్థులను ఎన్నారై విద్యార్థులతో ఆన్ లైన్ లో అనుసంధానం చేసి ఆధునిక సాంకేతిక విద్యను బోధించడానికి కృషి చేస్తామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ 2023 మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి (Ravi Potluri) తెలిపారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన వాసుబాబు గోరంట్ల, రామ్ చౌదరి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్, పారిశ్రామికవేత్త అనంత నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తానా మరియు రవి పొట్లూరి ని అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected