Connect with us

Kids

CNN హీరోగా 13 ఏళ్ల న్యూజెర్సీ తెలుగు విద్యార్థి శ్రీ నిహాల్‌ తమ్మన

Published

on

అమెరికాలో ప్రవాస తెలుగు విద్యార్ధి శ్రీ నిహాల్ తమ్మన కు అరుదైన గౌరవం లభించింది. అమెరికన్ టెలివిజన్ ఛానల్ సి.ఎన్.ఎన్ హీరోస్ (CNN Heroes) కార్యక్రమంలో శ్రీ నిహాల్ ను స్టూడియోకి పిలిచి సత్కరించింది. శ్రీ నిహాల్ రియల్ హీరో అని ప్రశంసించింది. ఇంతకీ శ్రీ నిహాల్ తమ్మన 13 ఏళ్ల వయస్సులోనే ఏం చేశాడు?

సమాజ శ్రేయస్సు కోసం, పర్యావరణ మేలు కోసం వినూత్నంగా ఆలోచించాడు. తనకు వచ్చిన ఆలోచనకు కార్యరూపం ఇచ్చాడు. అందరూ వాడి పడేస్తున్న బ్యాటరీలను సేకరించి వాటిని రీ సైక్లింగ్ (Battery Recycling) చేసే ప్రక్రియను చేపట్టాడు. మనం ఇళ్లలో వాడే బ్యాటరీలను చెత్తలో పడేయటం వల్ల అవి పర్యావరణానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నాయి.

ఈ సమస్యను పరిష్కారించడానికి శ్రీ నిహాల్ (Sri Nihal Tammana) బ్యాటరీ రీ సైక్లింగ్ కోసం తన వంతు కృషి ప్రారంభించాడు. బ్యాటరీల వల్ల వచ్చేఅనర్థాలు, ప్రమాదాలపై అవగాహన కల్పించి పనికిరాని బ్యాటరీలను కాలం చెల్లిన బ్యాటరీలను సేకరించే పనికి శ్రీకారం చుట్టాడు. వాటిని తిరిగి రీసైక్లింగ్ సెంటర్స్ కు పంపించాడు.

సిఎన్ఎన్ ఛానల్ (CNN News Channel) శ్రీ నిహాల్ చేసిన సేవలనుగుర్తించింది. సమాజంలో మార్పులు కోసం శ్రమించే, సమస్యలకు పరిష్కారాలు వెతికే రియల్ హీరోస్‌ను సీఎన్ఎన్ హీరోస్ పేరుతో సత్కరిస్తుంది. శ్రీ నిహల్ రియల్ హీరో అని సీఎన్ఎన్ (CNN) ప్రశంసించింది. అతడిని సత్కరించింది. ప్రస్తుతం శ్రీ నిహాల్ న్యూ జెర్సీ లో ఉంటున్నాడు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected