Doha, Qatar: భారతీయ ప్రవాసీ సమాజం కోసం ఇండియన్ కమ్యూనిటీ బెనివోలెంట్ ఫోరం (Indian Community Benevolent Forum – ICBF) ప్రత్యేక విద్యా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. “Are we teaching children to Lead or teaching them to Listen?” అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమం ICBF కంజాని హాల్లో నిర్వహించబడింది.
భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కమ్యూనిటీ నాయకులు, ప్రతినిధులు మరియు సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ధృవీకృత నాయకత్వ శిక్షకురాలు, కోచ్ మరియు మాజీ ICBF (Indian Community Benevolent Forum) మేనేజింగ్ కమిటీ సభ్యురాలు శ్రీమతి నిర్మల గురు ముఖ్య వక్తగా హాజరయ్యారు.
తన ముఖ్య ప్రసంగంలో శ్రీమతి నిర్మల గురు మాట్లాడుతూ… తల్లిదండ్రుల (Parents) పెంపకం విధానం పిల్లల స్వతంత్ర ఆలోచన, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మరియు బాధ్యతలను స్వీకరించే గుణంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వివరించారు.
అందరికీ సులభంగా అర్థమయ్యే ఉదాహరణలు, పరిశోధనాత్మక అంశాలు మరియు ప్రముఖ కార్టూన్ పాత్ర డోరేమాన్ మ్యాజిక్ పాకెట్ ఉదాహరణ ద్వారా పిల్లలకు సహాయం చేయడం మరియు వారి ప్రతి సమస్యను తల్లిదండ్రులే (Parents) పరిష్కరించడం మధ్య ఉన్న సున్నితమైన తేడాను వివరించారు.
పిల్లల్లో జిజ్ఞాస, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం, స్వీయ నియంత్రణ మరియు స్వతంత్రంగా ఆలోచించే గుణాలను పెంపొందించాలని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఆమె సూచించారు. పిల్లల అభివృద్ధి క్రమాన్ని వినడం → అర్థం చేసుకోవడం → ప్రశ్నించడం → నిర్ణయం తీసుకోవడం → నాయకత్వం వహించడం అనే విధంగా ఆమె వివరించారు.
కార్యక్రమం ICBF (Indian Community Benevolent Forum) జనరల్ సెక్రటరీ శ్రీ దీపక్ శెట్టి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. అనంతరం ICBF యాక్టింగ్ ప్రెసిడెంట్ శ్రీ రషీద్ అహ్మద్ అధ్యక్ష ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి నిర్మల గురు అందించిన సేవలు మరియు కార్యక్రమానికి చేసిన విశేష కృషికి గుర్తింపుగా శ్రీ రషీద్ అహ్మద్ ఆమెకు జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో Indian Community Benevolent Forum (ICBF)ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ శ్రీ కె.వి. బోబన్, ICC మేనేజింగ్ కమిటీ సభ్యుడు శ్రీ రవీంద్ర ప్రసాద్, శ్రీ మోహన్ కుమార్, అలాగే వివిధ భారతీయ సంఘాల పదాధికారులు మరియు ప్రతినిధులు ప్రముఖంగా పాల్గొన్నారు. ICBF సెక్రటరీ శ్రీ జాఫర్ తయ్యిల్ వందన సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమ సమన్వయంలో Indian Community Benevolent Forum (ICBF) మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ మణి భారతి, శ్రీమతి మినీ సిబి, శ్రీమతి నీలాంబరి ఎస్, శ్రీ అమర్ వీర్ సింగ్ మరియు శ్రీ శంకర్ గౌడ్ (Shankar Goud Sundaragiri) ముఖ్య పాత్ర పోషించారు.