Connect with us

News

చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కువైట్ లో సర్వమత ప్రార్ధనలు: TDP, Janasena

Published

on

ఎన్నారై తెలుగుదేశం కువైట్ (NRI TDP Kuwait) మరియు జనసేన (Janasena) కువైట్ సమ్యుక్త ఆధ్వర్యములో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా కడిగిన ముత్యం లాగా విడుదల కావాలని సర్వమత ప్రార్ధనలు చేశారు.

ఫర్వానియ (Al Farwaniyah, Kuwait) ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా ముస్లిం ఆచారం ప్రకారం నమాజు చేసి తరువాత క్రిస్టియన్ ఆచారం ప్రకారం బైబిల్ లోని కొన్ని వాక్యాలను చదివి ప్రార్దనలు చేశారు.

చివరగా హిందూ ఆచారం ప్రకారం కలియుగ దైవం వెంకన్న తండ్రిని గోవింద నామాలతో స్తుతించి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) క్షేమంగా త్వరగా విడుదల కావాలని ప్రార్దించారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం (Telugu Desam Party) నాయకులు కుదరవల్లి సుధాకర రావు, అక్కిలి నాగేంద్ర బాబు, మద్దిన ఈశ్వర్ నాయుడు, దుగ్గి శ్రీనివాస్. కొల్లి ఆంజనేయులు, మద్దిపట్ల శివ, నరేష్ పెంచల్ నాయుడు, సుంకేసుల అన్వర్, గాజులపల్లి సుబ్బా రెడ్డి, శివారెడ్డి, మహాసేన రాజేష్ రాపాక, సుబ్బరాజు, షేక్ రసూల్, ఖాదర్ వల్లి, గల్లా శ్రీనివాసులు, పూజుల శివ, మొదలగువారు మరియు జనసేన నాయకులు రామచంద్ర నాయక్, పగడాల అంజన్ కుమార్ శివ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected