Connect with us

News

న్యూజెర్సీలో ఘనంగా ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు

Published

on

ఎన్టీ రామారావు శతజయంతి వేడుకలు న్యూజెర్సీ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ శతజయంతి వేడుకలకు ముఖ్య అతిధులుగా పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణం రాజు గారు, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ గారు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు టి.డి జనార్దన్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్య నిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహన కృష్ణ గారు, గుంటూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం గారు, ఏపీఎన్నార్టీ (APNRT) మాజీ చైర్మన్ వేమూరి రవి కుమార్ గారు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున్న ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలందరు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారు మహానటుడిగా, మహానాయకుడిగా ఎన్టీఆర్ సాధించిన విజయాలు, చేసిన సేవలు చిరస్మరణీయం అన్నారు.

నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవం నినాదంతో తెలుగు వారి అభివృద్ధికి, అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతూ, అన్ని రంగాల్లో విఫలం అవ్వటం వలన ఏ విధంగా అభివృద్ధి కుంటుపడిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి స్వార్ధపూరిత రాజకీయ కుట్రల వలన వ్యవస్థలు ఏ రకంగా గాడి తప్పుతున్నాయో చూస్తున్నాం. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక చర్యలను ఖండిస్తూ ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిగా వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ఎన్నారైలందరు నడుంబిగించాలని, ఎన్నారైలందరు శ్రమించాలని పిలుపునిచ్చారు.

మన్నవ మోహన కృష్ణ గారి సారథ్యంలో జరిగిన ఈ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను వెనిగళ్ల మోహన్ కుమార్, నల్లమల్ల రాధాకృష్ణ, వెనిగళ్ల వంశీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected