Connect with us

News

కోలాహలంగా మేరీలాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, 6వ మహానాడు విజయవంతం

Published

on

అక్టోబర్ 15న అమెరికా లోని మేరీలాండ్ రాష్ట్రం, కొలంబియా నగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా 6 వ మహానాడు కోలాహలంగా జరిగింది. శ్రీనాధ్ రావుల నేతృత్వంలో విజయవంతంగా నిర్వహించిన ఈ శత జయంతి ఉత్సవాలలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఫోటో ఎగ్జిబిషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నది. అనంతరం చిన్నారులు గేయాలతో అలరించారు. వర్జీనియా, పెన్సిల్వేనియా, డెలావేర్ తదితర ప్రాంతాల నుండి తెలుగువారు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా టిడిపి ఎన్నారై కోఆర్డినేటర్ జయరాం మాట్లాడుతూ పాలకపక్ష వికృత చేష్టలతో ప్రజలు విసిగిపోయారని, ఎన్టీఆర్ స్పూర్తితో జగన్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలని జయరాం కోమటి అన్నారు.

వైసిపి దోపిడీ పాలన చూసి ప్రవాసాంధ్రులు పెట్టుబడి పెట్టడానికి వెనకాడుతున్నారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న వేళ హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తొలగించడం పట్ల తెలుగువారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తెలుగువాడి గుండె చప్పుడైన ఎన్టీఆర్ పేరు కొనసాగించాలని డిమాండ్ చేశారు.

వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డికి వికేంద్రీకరణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకోవటమేమిటని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తుంటే సాక్షాత్తు మంత్రులే ఆటంకాలు కల్పించడం కోర్టు ధిక్కరణ అవుతుందన్నారు.

గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ఏపీలో చట్టబద్ధ పాలన లేదు. పౌరుల ప్రాధమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. ప్రశ్నించిన వారిని అణచివేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారన్నారు. విశాఖలో భూములు దోచుకున్న విజయసాయిరెడ్డిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తానా పూర్వ అధ్యక్షులు సతీష్ వేమన, బోయపాటి వెంకటరమణ, డి.వి శేఖర్, ప్రొఫెసర్ నరేన్ కొడాలి, రవి మందలపు, శ్రీనివాస్ కూకుట్ల, సాయి బొల్లినేని, యష్ బొద్దులూరి, భాను మాగులూరి తదితరులు ప్రసంగించారు. మహేష్ నెలకుదిటి, శ్రీనివాసరావు దామా, శ్రీనివాసరం సామినేని, వాసు గోరంట్ల, శివ నెల్లూరి, జానకి భోగినేని, హర్ష పేరంనేని, వెంకట్ కూకట్ల, హరీష్ కూకట్ల క్రింది తీర్మానాలు ప్రవేశ పెట్టారు.

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు కొనసాగించాలి
అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావాలి
అన్నా క్యాంటీన్లు పునప్రారంభించాలి
పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected