Connect with us

Birthday Celebrations

Delaware: యుగపురుషుడి శతజయంతి ఉత్సవాల్లో వెల్లువెత్తిన అభిమానం

Published

on

తెలుగువారి ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను డెలావేర్ రాష్ట్రంలో ప్రవాస తెలుగువారు ఘనంగా జరుపుకున్నారు. ఉత్తర అమెరికాలోని 50 నగరాల్లో జరుగుతున్న అన్న ఎన్టీఆర్ శతవసంతాల సంబరాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా డెలావేర్ ఎన్నారై టీడీపీ (Delaware NRI TDP) కమిటీ అధ్వర్యంలో నిర్వహించిన సభకి శతాధిక అభిమాన కుటుంబాలు (100 మంది కి పైగా) షడ్రుచుల వంటకాలను తమ స్వహస్తాలతో తయారు చేసుకొచ్చి మరీ సభలో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు.

ముందుగా జ్యోతిప్రజ్వలన చేసి ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao) గురించి ప్రాంభోపన్యాసం చేసిన డా. వెలువోలు శ్యాంబాబు దంపతులతో మొదలైన కార్యక్రమం సంధ్య వేళ దాక అన్నగారి పౌరాణిక పద్యాలతో, సినిమా డైలాగులతో, ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆసాంతం సాగింది.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) సేవలను నెమరువేసుకుంటూ, భారత ప్రభుత్వం తక్షణమే ఎన్టీఆర్ కు భారతరత్న (Bharat Ratna) ప్రకటించాలి అని తీర్మానించారు. శంకరంబాడి సుందరాచారి రచించిన మా తెలుగుతల్లి పాటని భావయుక్తంగా ఆలపించిన కుమారి యశస్వీ పొన్నగంటి బృందాన్ని నిర్వాహకులు అభినందించారు.

అదేవిధంగా ఎన్టీఆర్ చిత్రలేఖన లో ఉత్సాహంగా పాల్గొన్న బాలలు చి॥ రిత్విక్ ఆలూరు, చి॥ శ్రీరాజ్ పంచుమర్తి, చి॥ తపస్వి గంట మరియూ చి॥ సమన్యు యెర్నేని లకు బహుమతులను అందజేసి భావితరాలను ప్రోత్యహించారు. అన్నగారి పాటలు, పద్యాలు, డైలాగులతో ఆహుతులను అలరించిన శ్రీని మాలెంపాటి, శ్రీని చెన్నూరి, శ్రీ & శ్రీమతి జ్యోతిష్ నాయుడు లోకేశ్వరి దంపతులకీ, శ్రీ గురు గారికీ మరియూ శ్రీ & శ్రీమతి శ్రీధర్ శ్రీలక్ష్మీ దంపతులకి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహాయసహకారాలు అందించిన సురేష్ పాములపాటి, హరి తూబాటి, వెంకీ ధనియాల, హిమతేజ ఘంటా, కిషోర్ కుకలకుంట్ల, శ్రీకాంత్ గూడూరు, ఆర్ శ్రీకాంత్, రావు పంచుమర్తి, హేమంత్ యెర్నేని, అజిత్, వ్యాఖ్యాత సత్య అట్లూరి, వేడుకకు హాజరైన ప్రతి ఒకరికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ యుగపురుషుడి శతజయంతి ఉత్సవాల్లో డెలావేర్ ఎన్నారై టీడీపీ (Delaware NRI TDP) కార్యాచరణ కమిటీ సభ్యులు సత్య పొన్నగంటి, శ్రీధర్ ఆలూరు, శివ నెల్లూరి, సుధాకర్ తురగ, చంద్ర ఆరె, విశ్వనాథ్ కోగంటి తదితరులు పాల్గున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected