Connect with us

Birthday Celebrations

Pennsylvania: హారిస్బర్గ్ లో తెలుగుజాతి గౌరవం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు

Published

on

అమెరికాలోని హారిస్బర్గ్ మహానగరంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, ప్రముఖ దర్శకులు వైవీఎస్ చౌదరి, డాక్టర్ మీగడ రామలింగస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. జగన్ కబంధ హస్తాల నుంచి చంద్రబాబునాయుడు మాత్రమే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనం సమాజానికి శాపం కాకకూడదు.

తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి ప్రవాసాంధ్రుడు కృషిచేయాలన్నారు. రాష్ట్ర పునర్ నిర్మాణం చంద్రబాబుతోనే సాధ్యమని మన్నవ సుబ్బారావు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ద్వారానే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని అన్నారు.

వైవీఎస్ చౌదరి మాట్లాడుతూ.. అన్నిటికంటే నేను ఎన్టీఆర్ అభిమానినని అనిపించుకోవడమే నాకు గర్వంగా, ఆనందంగా ఉంటుంది. నా దినచర్యే ఎన్టీఆర్ నామస్మరణతో ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ నాకు భగవంతుడితో సమానం. తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ చరిత్ర అజరామరంగా నిలుస్తుందన్నారు.

డాక్టర్ రామలింగస్వామి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగు భాషకు, తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారు. సినీ, రాజకీయ జీవితంలో రారాజుగా వెలుగొందారని అన్నారు. ఎన్ఆర్ఐ తెలుగుదేశం హారీస్బర్గ్ సభ్యులు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ప్రతి ఒక్కరిని అలరించాయి. ఎన్టీఆర్ రూపాల్లో చిన్నారులు తమ నృత్యప్రదర్శనలతో కనువిందు చేశారు.

ఈ వేడుకకు పెద్దఎత్తున మహిళలు, చిన్నారులు హాజరయ్యారు. ప్రముఖ గాయని దీప్తి నాగ్, గాయకులు ప్రసాద్ సింహాద్రి తమ సంగీత విభావరితో ఆకట్టుకున్నారు. తమ పాటలతో అందరినీ ఉర్రూతలూగించారు.

ఈ కార్యక్రమంలో సతీష్ చుండ్రు, సాంబ అంచ, వెంకట్ సింగు, వెంకట్ చిమ్మిలి, శశి జాస్తి, రాజు గుండాల, వంశీ ముప్పాళ్ల, శ్రీనివాసరావు కోట, వెంకట సుబ్బారావు ముప్ప, సునీల్ పొందూరి, ప్రవీణ్ జంపన, శ్రీనివాస్ అబ్బూరి, ఉపేంద్ర దేవినేని, సాంబ నిమ్మగడ్డ, శ్రీనివాస్ కాకర్ల, వేణు మక్కెన, రాంబాబు కావూరి, గోపీచంద్ తలశిల, ప్రతాప్ యార్లగడ్డ, కిషోర్ కొంక, భాను మాగులూరి, సాయి బొల్లినేని, చక్రవర్తి, నాగార్జున నల్లమోతు, చంద్ర, మైనేని రాంప్రసాద్, కిషోర్ కంచర్ల, రమ చెరుకుమల్లి, భరత్ కట్టా తదితర ఎన్ఆర్ఐ తెలుగుదేశం హారీస్బర్గ్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected