Connect with us

News

విరిసిన తెలుగు పద్మాలకు NATS అభినందనలు; నాగేశ్వర రెడ్డి, బాలకృష్ణ లకు ప్రశంసలు

Published

on

భారత ప్రభుత్వం దువ్వూరి నాగేశ్వర రెడ్డి (Dr. Duvvur Nageshwara Reddy, Gastroenterologist) కి పద్మవిభూషణ్ (Padma Vibhushan), నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కు పద్మభూషణ్ (Padma Bhushan) పురస్కారం ప్రకటించడంపై నాట్స్ (NATS) హర్షం వ్యక్తం చేసింది. వైద్య రంగంలో నాగేశ్వర రెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని, అంతర్జాతీయంగా కూడా నాగేశ్వరరెడ్డి గుర్తింపు తెచ్చుకుని తెలుగువారందరికి గర్వకారణంగా నిలిచారని నాట్స్ ఓ ప్రకటనలో తెలిపింది.

అలాగే  నందమూరి బాలకృష్ణ నటుడిగా, ప్రజా ప్రతినిధిగా, బసవ తారకం (Basavatarakam Indo American Cancer Hospital & Research Institute) క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా సమాజ సేవకుడిగా చేస్తున్న పనులకు పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం గౌరవించడం అభినందనీయమని తెలిపారు.

కళారంగం నుంచి  ప్రముఖ అవధాని మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావు, సాహిత్యం విద్యారంగం నుంచి కె.ఎల్ కృష్ణ, వాదిరాజ్ రాఘవేంద్రాచార్య పంచముఖి, సామాజిక రంగం నుంచి మందకృష్ణ మాదిగ లకు పద్మ పురస్కారాలు (Padma Awards) వరించడంపై అమెరికాలో ఉండే తెలుగు వారందరికి సంతోషంగా ఉందన్నారు.

పద్మ పురస్కారాలు సాధించిన తెలుగువారికి అమెరికాలో ఉండే తెలుగువారి తరపున North America Telugu Society – NATS శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు నాట్స్ చైర్మన్ ప్రశాంత్  పిన్నమనేని (Prasanth Pinnamaneni) మరియు నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి (Madan Pamulapati) ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected