Connect with us

Associations

తానా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తానంటున్న వైద్య నిపుణులు డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి

Published

on

తానా ఎన్నికల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి బరిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. టీం నిరంజన్ తో కలిసి నడుస్తున్న తను తానా దీర్ఘకాలిక ప్రయోజనాలకు పెద్దపీట వేస్తానంటున్నారు. సంస్థ సదాశయాలకు, ప్రాజెక్టులకు, బలోపేతమైన విధివిధానాలకు, సభ్యులకు మెరుగైన సేవలు అందించేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా కురుమద్దాలికి చెందిన డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి 1995లో వైద్య విద్య నిమిత్తం అమెరికాకు వచ్చారు. 2007నుండి తానా జీవిత కాల సభ్యుడిగా ఉన్న ఆయన 2015లో తొలిసారిగా తానా గ్రంథాలయ కమిటీలో సేవలందించారు. అనంతరం 2017 నుండి బోర్డు సభ్యునిగా సేవలందిస్తున్నారు. తానాలో కన్వెన్షన్ తదితర కార్యక్రమాలకు స్పాన్సర్ చేయడం, అమరావతి రైతులకు వెన్నుదన్నుగా ఉండడం ముఖ్యంగా చెప్పుకోదగినవి.

తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యులుగా ఉన్న ముగ్గురు వైద్య నిపుణుల్లో డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి ఒకరు. ఎన్నికల్లో గెలుపోటములు, ప్యానెళ్లు సహజమని గెలిచాక ఎలాంటి ఉద్దేశంతో ముందుకు సాగుతున్నామనేది ముఖ్యమని అందరూ హుందాగా వ్యవహరించాలని కోరారు. ఎంతో మంది వైద్యుల ఆధ్వర్యంలో నడిచి 44 ఏళ్ల ఘనచరిత్రను కైవసం చేసుకున్న తానాకు మరోసారి మరో వైద్యుడికి సేవ చేసే అవకాశం కల్పించవల్సిందిగా డా. నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి తానా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.

గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థి అయిన డా.కొడాలి ప్రపంచ ప్రసిద్ధ వైద్య విశ్వవిద్యాలయాల్లో విద్యనభ్యసించడమే గాక ఆయా కళాశాలలు, ఆసుపత్రుల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీలో వైద్య విద్యనభ్యసించి అట్లాంటాలోని ఎమొరీ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న ఎగెల్‌స్టన్ చిన్నారుల ఆసుపత్రిలో వైద్యుడిగా, అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం హ్యూస్టన్‌లోని ప్రఖ్యాత బేలర్ కాలేజీ ఆఫ్ మెడిసిన్‌కు అనుబంధంగా ఉన్న టెక్సాస్ చిన్నారుల ఆసుపత్రిలో చిన్నారుల కార్డియాక్ ఎనస్థీషియాలజిస్ట్‌గా బాధ్యతలు స్వీకరించి మంచిపేరు గడించారు.

error: NRI2NRI.COM copyright content is protected