Connect with us

Associations

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం CATS నూతన కార్యవర్గ బాధ్యతల స్వీకరణ @ Washington DC

Published

on

తెలుగు భాషా, సాహిత్య, సాంస్కృతిక మరియు క్రీడా రంగాలకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్న రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) వారు 2024-2025 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని జనవరి 28వ తేదీన రాక్‌విల్లే (Rockville) నగరం, మేరీల్యాండ్ (Maryland) రాష్ట్రం, Washington DC లో జరిగిన బోర్డు సమావేశంలో ప్రకటించారు.

ఈ సందర్భంగా గోపాల్ నున్న గారు Capitol Area Telugu Society (CATS) సంస్థ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. Trustees, అడ్వైజర్స్ తోపాటు కాట్స్ వ్యవస్థాపకులు రామ్మోహన్ కొండా గారు, చిత్తరంజన్ నల్లు గారు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు.

రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం (CATS) లాంటి గొప్ప సంస్థ కి అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు తీసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని గోపాల్ నున్న (Gopal Nunna) చెప్పారు. ఉత్తర అమెరికా లోనే ప్రతిష్టాత్మక సంస్థ అయిన CATS ను ముందుండి నడపాల్సిన బాధ్యతను తన మీద పెట్టినందుకు CATS సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

సంస్థ ప్రమాణాలను మరింత పెంచే దిశగా నూతన కార్యక్రమాలను 2024-25 చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని, అనుభవజ్ఞులైన వారి సలహాలతో కొత్తగా కార్యవర్గంలో చేరిన వారి ఆలోచనలను రంగరిస్తూ కొత్త ఒరవడితో 60 మందితో కూడిన కీలక కార్యనిర్వాహక బృందం మరియు పాలకమండలి నుంచి పూర్తి సహకారాన్ని ఆశిస్తున్నానని గోపాల్ తెలియజేశారు.

వైస్ ప్రెసిడెంట్ పార్థ బైరెడ్డి (Partha Byreddy) గారు మాట్లాడుతూ.. గతంలో సంస్థకు తాను చేసిన కోశాధికారి (Treasurer) మరియు జనరల్ సెక్రటరీ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమాలను మరింత విస్తృత పరిచేలా తమ కార్యవర్గం నిర్ణయం తీసుకుంటామని తెలియజేసారు.

Capitol Area Telugu Society (CATS) మాజీ అధ్యక్షుడు సతీష్ వడ్డీ (Sathish Vaddi) గారు మాట్లాడుతూ.. తన హయాంలో కన్నా ఇంకా ఎక్కువగా సేవా కార్యక్రమాలను చేపట్టి CATS సంస్థను ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.

అధికారిక కార్యనిర్వాహక బృందం(2024-2025)
శ్రీ గోపాల్ నున్న – చైర్ పర్సన్ (అధ్యక్షుడు)
శ్రీ పార్థ ఎస్ బైరెడ్డి – వైస్ ఛైర్‌పర్సన్ (వైస్ ప్రెసిడెంట్)
శ్రీ కృష్ణ కిషోర్ గాయం- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – కంప్లైన్స్ (జనరల్ సెక్రటరీ)
శ్రీమతి లక్ష్మి లావణ్య తేలు – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – కల్చరల్, (సాంస్కృతిక కార్యదర్శి)
శ్రీ మహేష్ అనంతోజు – ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – ఫైనాన్స్, (కోశాధికారి)
శ్రీ లక్ష్మీకాంత్ గొట్టం- ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ – ఛారిటీస్ & కమ్యూనిటీ అఫైర్స్

2024-2025 కాలానికి ట్రస్టీలు
శ్రీ రవి బొజ్జా
శ్రీమతి సుధా రాణి కొండపు
శ్రీ ప్రవీణ్ కాటంగూరి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected