ఒహాయో రాష్ట్రంలోని కొలంబస్ తెలంగాణ అసోషియేషన్ (Columbus Telangana Association – CTA) అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. CTA 2024 అధ్యక్షులు ఆర్ కె రెడ్డి తేరా (RK Reddy Tera) నిర్వహణలో ‘తెలంగానం’ పేరుతో నిర్వహించిన ఈ వేడుకలు అద్వితీయంగా ముగిశాయి.
గత వారాంతం జూన్ 14, 15 తేదీలలో రెండు రోజులపాటు ఇండియా (India) నుంచి విచ్చేసిన సెలబ్రిటీస్ నడుమ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర అవిర్బావ దినోత్సవ (Telangana State Formation Day) వేడుకలు నిర్వహించడం విశేషం. సుమారు 1000 మందికి పైగా ప్రవాసులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.
మొదటి రోజు జూన్ 14, శుక్రవారం రోజున కొలంబస్ (Columbus, Ohio) లోని స్థానిక క్రౌన్ ప్లాజా లో బాంక్వెట్ డిన్నర్ (Banquet Dinner with Celebrities) నిర్వహించారు. టాలీవుడ్ నుంచి విచ్చేసిన నటీనటులు, గాయనీగాయకులతో స్టార్ స్టడెడ్ ఈవెంట్ లా సందడిగా నడిచింది. ఫోటో షూట్, మిమిక్రీ, సంగీత విభావరి, డీజే మ్యూజిక్, చక్కని భోజనంతో కార్యక్రమం హై లైట్ అయ్యింది.
రెండవ రోజు జూన్ 15, శనివారం రోజున కొలంబస్ నార్త్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియంలో తెలంగాణ (Telangana) రాష్ట్ర సంస్కృతీ సాంప్రదాయాలే ప్రధానంగా ‘తెలంగానం’ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో శుభప్రదంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆహ్వానితులందరికీ స్వాగతం పలికారు.
తెలంగానం లో భాగంగా తెలంగాణ కళలను ప్రతిబింభించే సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), నాటకాలు, ఫ్యాషన్ షో, గ్రాడ్యుయేషన్ పార్టీ, మ్యూజికల్ కాన్సర్ట్, షాపింగ్ స్టాల్ల్స్, తెలంగాణ రుచులతో ప్రత్యేక భోజనం ఆహ్వానితులందరినీ ఆకట్టుకున్నాయి. జల్ జంగల్ జమీన్ అంటూ ప్రదర్శించిన తెలంగాణ స్టేజ్ ప్లే అందరి మన్ననలు పొందింది.
రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలలో పాల్గొన్న సెలబ్రిటీస్ (Celebrities) లో సినీ నటీమణులు మెహ్రీన్ & నందిని రాయ్, నాగర్ కర్నూల్ శాసనసభ సభ్యలు కె. రాజేష్ రెడ్డి, బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ, సింగర్స్ భోలే శావలి, శ్రిష్టి చిల్లా, భిక్షు నాయక్, దండేపల్లి శ్రీనివాస్, జనార్దన్ పన్నెల, శ్రీనివాస్ దుర్గం, మిమిక్రీ రమేష్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా సభికులను ఉద్దేశించి సెలబ్రిటీస్ ప్రసంగించారు. తమను ఈ వేడుకలకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్పాన్సర్స్ ని మరియు సెలబ్రిటీస్ ని వేదికపైకి సాదరంగా ఆహ్వానించి శాలువా, పుష్పగుచ్ఛాలతో కొలంబస్ తెలంగాణ అసోషియేషన్ (Columbus Telangana Association – CTA) కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు.
అందరూ టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీస్ తో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా కనిపించారు. మహిళలు వెండర్ స్టాల్ల్స్ లో కలియ తిరుగుతూ ఉత్సహంగా షాపింగ్ చేశారు. గాయనీ గాయకులు మాంచి బీట్ ఉన్న పాటలు పాడడంతో (Musical Concert) సభికులు సైతం డాన్స్ చేయడం కొసమెరుపు. వేదిక అలంకరణ తెలంగాణ ను ప్రతిబింభించింది.
ఈ వేడుకలు ప్రేక్షకులను తెలంగాణ (Telangana) యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వంలో ముగ్ధులను చేసి, లీనమయ్యేలా చేసింది. సంప్రదాయాలను పరిరక్షించడానికి మరియు ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కొలంబస్ తెలంగాణ అసోషియేషన్ (Columbus Telangana Association – CTA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించడంలో CTA ప్రెసిడెంట్ ఆర్ కె రెడ్డి తేరా (RK Reddy Tera) మరియు వారి కార్యవర్గ సభ్యుల కృషి మరువలేనిది.
CTA కార్యవర్గ సభ్యులు ప్రణీత, అశ్విని, రామ్, మధునిక, స్వాతి, శ్వేత, వందన, రోహిత్, మధు, నరేందర్, శివ, అరుణ్, మరియు అడ్వైజరీ బోర్డు సభ్యులు అమర్ రెడ్డి, శ్రీధర్ బిలకంటి, అశోక్ ఇల్లేందుల, మహేష్ తన్నీరు, అలాగే బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ రమేష్ మధు, సాజిత్ దేషినేని, శ్రవణ్ చిడురుప్ప, మనోజ్ పోకల, ప్రమోద్ జనగామ, రఘు రెడ్డి, శ్రీనివాస్ ఆకుల, వెంకట్ తాళ్లేపల్లి, విక్రం ఎర్రబెల్లి, వంశీ నామల, రోహిత్ యమ ఈ వేడుకల నిర్వహణలో పాలుపంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరూ CTA కార్యవర్గాన్ని, అడ్వైజరీ బోర్డు సభ్యులను మరియు బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ని అభినందించారు. చివరిగా వందన సమర్పణతో రెండు రోజులపాటు ఒక పండుగలా నిర్వహించిన CTA తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విజయవంతమైన ముగింపు పలికారు.