Connect with us

Associations

జనార్ధన్ నిమ్మలపూడి: తానాలో జవాబుదారీతనాన్ని తీసుకువస్తా

Published

on

తానాలో జవాబుదారీతనాన్ని తీసుకువస్తా అంటున్నారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అభ్యర్థి జనార్ధన్ నిమ్మలపూడి. ఆంధ్రరాష్ట్రంలో రాజమండ్రి సమీపంలోని మిర్తిపాడు గ్రామానికి చెందిన జనార్ధన్ గత పుష్కర కాలంగా తానాతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. తానాలో రీజినల్ కోఆర్డినేటర్ గా, టీం స్క్వేర్ వాలంటీర్ గా, బోన్ మారో డ్రైవ్స్ లో, 5కే వాక్/రన్, ధీమ్ తానా, ఆటిజం తదితర కార్యక్రమాలలో విరివిగా సేవలందించారు. అలాగే తారక్ ఫౌండేషన్ అనే నాన్ ప్రాఫిట్ సంస్థను స్థాపించి, విద్య ఆరోగ్య రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే ప్రభావవంతమైన నిర్ణయాలు, తద్వారా నాణ్యమైన సేవా కార్యక్రమాల ఏర్పాటుకు కృషి చేస్తానని అన్నారు. జవాబుదారీతనం లేని చోట విలువలు ఉండవని తాను విశ్వసిస్తానని, అందుకే తానాలో జవాబుదారీతనాన్ని ప్రోది చేసే దిశగా చొరవ తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. 2004లో అమెరికాకు వచ్చిన ఆయన ప్రస్తుతం వాషింగ్టన్ డీసీలో ప్రభుత్వ రంగ ప్రాజెక్టుల్లో ఐటీ విభాగంలో సేవలందిస్తున్నారు. వర్జీనియాలోని హెర్నడన్‌లో నివశిస్తున్న జనార్ధన్ తానాతో పాటు APNRT లో కీలకంగా వ్యహవరించారు.

error: NRI2NRI.COM copyright content is protected