Connect with us

News

నారా లోకేష్ యువగళం 150 రోజుల సీడీ ఆవిష్కరణ @ Philadelphia

Published

on

నారా లోకేష్ యువగళం పాదయాత్ర 150 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరంలోని మారియాట్ హోటల్ లో ఆదివారం జులై 9న సిడి ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ నాయకులు టి డి జనార్దన్ మాట్లాడుతూ నారా లోకేష్ పాదయాత్ర కి అపూర్వ ఆదరణ, అన్నివర్గాల ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. యువగళం 150 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాదయాత్ర ముఖ్య సన్నివేశాలతో కూడిన సిడి ని డల్లాస్ నగరానికి చెందిన ఎన్నారై తెలుగుదేశం నాయకుడు శ్రీనివాసరావు కొమ్మినేని రూపొందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కొమ్మినేని మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రజల సమస్యలను తెలుసుకొంటున్నారని, తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజల సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని పేదరిక రహిత రాష్ట్రముగా తీర్చి దిద్దగల సామర్ధ్యం చంద్రబాబు కి ఉన్నాయన్నారు.

రాష్ట్రాభివృద్ధి, భావితరాల భవిషత్ కొరకు చంద్రబాబు తిరిగి ముఖమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం ప్రెవేశ పెట్టాలనుకుంటున్న పథకాలు మహాశక్తి, అన్నదాత, ఇంటింటికీ నీరు, బిసిలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, విషత్తుకు గ్యారంటీ పధకాలు అద్భుతం గా ఉన్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టిడి జనార్దన్, అశ్విన్ అట్లూరి, శ్రీనివాస్ కొమ్మినేని, మధు యార్లగడ్డ, వంశి పోతినేని తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected