Connect with us

Devotional

బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ మొదటి అష్టావధానం @ Scotland, UK

Published

on

ప్రపంచంలోనే అత్యంత అందమైన దేశాల్లో ఒకటైన స్కాట్లాండ్ (UK) లోని, అచ్చం తిరుపతి వలె ఏడుకొండలతో విరాజిల్లుతున్న ఎడింబరో నగరంలో, అంగరంగ వైభవంగా మొట్టమొదటి అష్టావధానం శ్రీ ప్రణవ పీఠాధిపతి (ఏలూరు) బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే తేదీ 9 జులై 2023, శ్రీ శోభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢం, భానువారం రోజున శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు ఘనంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎడింబరో హిందు మందిర్ వేదికయ్యింది. వందలాది తెలుగు ప్రజలు పొరుగు నగరాల నుండి కూడా ఏడింబరో విచ్చేసి ఆసక్తిగా తిలకించడం విశేషం.

త్రిభాషా మహాసహస్రావధాని, అవధాన విశ్వగురుబ్రహ్మ, సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు, నిర్వాహకులు విజయ్ కుమార్ రాజు పర్రి గారు, గౌరవ అతిథులుగా విచ్చేసిన స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి కెంబూరి గారు జ్యోతి ప్రజ్వలన చేయగా, స్కాట్లాండ్ కు చెందిన గాయకుడు కుమార్ అనీష్ కందాడ గణేశుని ప్రార్థనా గీతం ఆలపించగా కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి పృచ్ఛకులుగా తెలుగు భాషను అమితంగా ప్రేమించే వారు కావడం వలన భానుసప్తమీ పర్వదినాన 12 మంది దివ్యమైన సూర్యుల కాంతి పద్మాకరునిపై వెదజల్లినటు ప్రకాశిస్తూ దివ్యంగా సాగిందీ కార్యక్రమం.శ్రీమతి పల్లవి మంగళంపల్లి గారు వారి తీయనైన గాత్రముతో పృచ్ఛకులను వేదికమీదకు ఆహ్వానించిన తీరు రసరమ్యము. సమస్యాపూరణం – శ్రీ నాగ ప్రసాద్ మంగళంపల్లి గారు – వీరు సంధించిన సమస్య చాలా అద్భుతం.

దత్తపది – శ్రీ రంజిత్ నాగుబండి గారు – వీరు సంధించిన నాలుగు పదాలు చాలా రమణీయముగా కలవు

వర్ణన – శ్రీమతి సాయికుమారి దొడ్డ గారు – భారతీయుల గొప్పదనాన్ని వర్ణించమని వినూత్న తరహాలో అడిగినట్టి సందర్భం

నిషిద్ధాక్షరి – శ్రీమతి శైలజ గంటి గారు – పోటాపోటీగా సాగిన వీరి అక్షర నిషిద్ధం అమోఘం

న్యస్తాక్షరి – శ్రీమతి హిమబిందు జయంతి గారు – కీలకమైన స్థానాలలో అక్షరాలను ప్రతిపాదిస్తూ సాగిన క్లిష్టమైన ప్రక్రియ

ఆశువు – శ్రీ అనంత రామానంద్ గార్లపాటి గారు, శ్రీమతి మమత వుసికల గారు – వీరి పద్య గద్య సందర్భ ప్రయోగం చాలా వినూత్నంగా చూపరులను ఆకట్టుకొంది. పురాణ పఠనం – శ్రీ విజయ్ కుమార్ రాజు పర్రి గారు, శ్రీ మిథిలేష్ వద్దిపర్తి గారు, శ్రీ పండరి జైన్ కుమార్ పోలిశెట్టి గారు – ముగ్గురూ ముగ్గురే.. పద్య గాన చాతుర్యమును మూడు విధముల ప్రయోగించడం అన్నది అమోఘం. అప్రస్తుత ప్రసంగం – శ్రీ సత్యశ్యాం కుమార్ జయంతి గారు, శ్రీ నిరంజన్ నూక గారు – వీరి చురుక్కులు, చమక్కులు భలే గమ్మత్తుగా, సమకాలీన పరిస్థితులకు అద్దంపట్టేలా, నవ్వులు పూయించేలా మరియు ఆలోచింపజేసివిగాను వుండడం విశేషం.

అవధాని గారు తమకున్న అపారమైన జ్ఞానాన్ని ఆపాదిస్తూ అన్ని అంశాలకు పద్యాలను అల్లిన తీరు పృచ్ఛకులకే కాక చూపరులకు కూడా మహదానందం కలిగిందనడంలోఆశ్చర్యంలేదు. ఆద్యంతం రసవత్తరముగా సాగిన ఈ కార్యక్రమమునకు విశ్రాంత అధ్యాపకులు డా. శ్రీ అయ్యగారి జగన్నాథ కామేశ్వర ప్రసాద్ గారు అవధాని గారి ధారణా శక్తిని కొనియాడుతూ, పృచ్ఛకుల కార్యదక్షతను ప్రశంసిస్తూ విమర్శనాత్మక విశ్లేషణ చేశారు.

కార్యక్రమ అనంతరం అవధాని సతీసమేత వద్దిపర్తి పద్మాకర్ గార్లని నిర్వాహకులు విజయ్ గారు మరియు పృచ్ఛకులు పట్టు శాలువాతో, సన్మాన పత్రంతో, పట్టు బట్టలతో, కానుకలతో, పూలు పండ్లతో సత్కరించారు.హిమాలయాల తపోఫలం సిద్ధించినటువంటి త్రిభాషా మహాసహస్రావధానులు, శ్రీ సత్య సాయి బాబా వారు, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు, విశ్వయోగి విశ్వంజీ, వాడేకర్ మహారాజు వంటి మహా పీఠాధిపతులచే అనేక సత్కారాలను పొందినటువంటి బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు తామే స్వయంగా స్వహస్తాలతో ఈ 12 మంది పృచ్ఛకులను సత్కరించడం అష్టావధాన చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం. మహా అవధానులు పృచ్ఛకులను సత్కరించడం అరుదైన విశేషం!

‘న భూతో న భవిష్యతి’ అనే విధముగా సాగిన ఈ కార్యక్రమానికి చివరగా నిర్వాహకులు విజయ్ గారు అవధాని గారికి, పృచ్ఛకులకు, సభికులకు, గౌరవాతిథులు స్కాట్లాండ్ తెలుగు సంఘం చైర్మన్ శ్రీమతి మైథిలి గారికి, అక్షరశిల్పి విశ్రాంత బి యస్ యన్ యల్ ఎ జి యం శ్రీ అయ్యగారి కోదండ రావు గారికి, పృచ్ఛకులకు తోడ్పాటు నందించిన శ్రీ తల్లాప్రగడ రామచంద్ర రావు గారికి, హిందు మందిర్ యాజమాన్యం శ్రీ రాజశేఖర్ జాలా గరికి, వాలంటీర్లకు, నిర్వహణలో సహాయపడిన స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలుపగా, వేడుకను మంగళహారతితో సోదరీమణులు శ్రీమతి శ్రీవిద్య కందాడ, శ్రీమతి రేఖ దుగ్యాల, శ్రీమతి రాజి చక్క చక్కగా ముగించారు.

ఈ కార్యక్రమానికి మొదటి నుంచీ చివరి వరకు వెన్నంటి ఉండి సహాయ సహకారాలు అందించిన వారు:

సహాయకులు:

శ్రీ రామచంద్ర దుగ్యాల గారు

శ్రీ కృష్ణ జుట్టాడ గారు

శ్రీ అశ్విన్ బక్కచెన్నగారి గారు

శ్రీ సంతోష్ శ్రీరామ గారు

శ్రీ సంతోష్ తోట గారు

శ్రీ సూర్య కిరణ్ గారు

శ్రీ ప్రదీప్ కందాడ గారు

శ్రీమతి రేవతి సదా గారు

శ్రీ లక్ష్మణ్ గారు

శ్రీమతి వరలక్ష్మి గారు

శ్రీమతి రమ్య గారు

శ్రీమతి శ్రీలక్ష్మి గారు

శ్రీమతి స్వాతి నాగుబండి గారు

శ్రీమతి శ్రీభార్గవి గునిశెట్టి

వాలంటీర్లు:

కార్తీక్ బొర్ర

జాహ్నవి బొర్ర 

శివ జ్యోతి సంగం

యూనిస్ బైగ్ షేక్

బెంజమిన్ 

అస్మిత కట్టా

హరిణి రెడ్డి మంద

శ్రీ సాయి సుచిత్ రెడ్డి వీరవెల్లి

శ్రీమతి రీషిక వీరవెల్లి

సాయి కిరణ్

అక్షర షాహిరి

సాయికృష్ణ పారెకర్

అదే రోజు సాయంత్రం ‘శ్రీ కృష్ణ లీలలు’ అంశం మీద భక్తి ప్రవచనాలు కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. 

కార్యక్రమాలను క్రింది లంకెలలో వీక్షించండి.

అష్టావధానం: https://fb.watch/lGbwVREE9j

భక్తి ప్రవచనాలు: https://fb.watch/lGCnvIaqFg

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected