Connect with us

Service Activities

ఉదారత చాటిన రాజా కసుకుర్తి, పేద కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ

Published

on

ఫిబ్రవరి 23న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ మరియు అరిమిల్లి రాధాకృష్ణ ‘ఏఆర్కె’ టీమ్ సంయుక్తంగా 60 పేద కుటుంబాలకు ఉచితంగా దుప్పట్లు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు మండలం, దువ్వ గ్రామంలో తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సౌజన్యంతో ఈ సేవాకార్యక్రమాన్ని నిర్వహించారు. తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ మరియు దువ్వ గ్రామ నాయకుల చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చేసారు.

అరిమిల్లి మాట్లాడుతూ తానా మరియు టీమ్ ఏఆర్కె ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవకార్యక్రమలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన తానా అద్యక్షులు లావు అంజయ చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మరియు సమన్వయకర్త రవి సామినేని లను గ్రామస్తులు అభినందించారు.

ఈ కార్యక్రమంలో తణుకు మండల అధ్యక్షులు, దువ్వ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సిరిగిశెట్టి వెంకటేశులు, పోతుల సత్యనారాయణ, కట్ట సూర్యారావు, బొరుసు సత్యనారాయణ, ఆలపాటి కాశీ, కాకి రాముడు, కొండేటి శివ, పత్తి రామకృష్ణ, చేకూరి ప్రసాదరాజు, ఇడుపుగంటి జగదీష్, రుద్ర సత్యనారాయణ, గిద్ద దనరాజు, ఆలపాటి వెంకట్రావు, కేదార్ రాము, మైపాల నాగయ్య మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected