Connect with us

Politics

నియోజకవర్గాల వారీగా మరో విడత NRI TDP అసెంబ్లీ కోఆర్డినేటర్స్ నియామకం

Published

on

ఎన్నారై టీడీపీ యూఎస్ఏ (NRI TDP USA) కోఆర్డినేటర్ జయరాం కోమటి (Jayaram Komati) ఆధ్వర్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల పరంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎన్నారై టీడీపీ అసెంబ్లీ కోఆర్డినేటర్స్ ని నియమిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

అమెరికాలోని ప్రవాసులలో ముఖ్యపాత్ర పోషిస్తున్న వారిని ఐడెంటిఫై చేసి ఈ నియామకాలు చేస్తున్నారు. ఈ మేరకు లెటర్ హెడ్ పై వారి వివరాలు మీడియాకి రిలీజ్ చేశారు. వీరందరూ వచ్చే 2024 ఎన్నికల్లో తమ తమ నియోజకవర్గాలలో సహాయపడేవిధంగా ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్నారు.

కీంద్రీకృతంగా సమన్వయం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేలా, నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ని ముఖ్యమంత్రిగా అసెంబ్లీ కి పంపేలా అడుగులు వేయనున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగా కార్యాచరణ చేయనున్నారు.

ఈ సందర్భంగా వీరందరికీ ఎన్నారై టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ (NRI TDP USA Coordinator) జయరాం కోమటి అభినందనలు తెలియజేశారు. అందరూ వచ్చే 6 నెలలు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని కష్టపడి పనిచేయాలన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected