Dallas, Texas: డాక్టర్ వైఎస్సార్ ఫౌండేషన్ (Dr. YSR Foundation) ఆధ్వర్యంలో, సెప్టెంబర్ 26, 2026న టెక్సాస్లోని కాపెల్ (Coppell) లో గల కాపెల్ అత్యవసర వైద్య కేంద్రం (Coppell ER) లో ఒక గొప్ప రక్తదాన శిబిరం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళిగా నిర్వహించారు.
ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో చాలామంది దాతలు ఉత్సాహంగా పాల్గొని రక్తం ఇచ్చారు. ప్రతి రెండు సెకన్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుందని కార్టర్ బ్లడ్కేర్ సంస్థ (Carter BloodCare) అంచనా వేసింది. ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తం ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది.
ఈ సందర్భంగా ముఖ్య నిర్వాహకులలో ఒకరైన డాక్టర్ రాజేంద్ర పోలు మాట్లాడుతూ, “ప్రజల సంక్షేమం కోసం జీవితాన్ని అంకితం చేసిన వైఎస్ఆర్ (YSR) గారిని స్మరించుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రక్తదానం ఆయన సేవా దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది” అని అన్నారు. మరో ముఖ్య నిర్వాహకుడు సుధాకర్ మేనకూరు Carter Care Blood చెందిన Aaron Devlin, Holly లకు, మరియు Coppell ER కు చెందిన Marketing Manager, Muhammad Shahid కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన వల్లూరు శివశంకర్ రెడ్డి, నాగార్జున రెడ్డి దారుకమల్లి, సుబ్రమణ్యం రెడ్డి ఆర్ బి, నాగరాజ్ గోపిరెడ్డి, వీరశివ రెడ్డి లేవక, శ్రీకాంత్ రెడ్డి జొన్నాల, చైతన్య రెడ్డి మరియు తరుణ్ రెడ్డి రక్తదాతలైన నాగేశ్వర్ రెడ్డి వెన్నపూస, వివేకానంద లింగిరెడ్డి, కొండారెడ్డి లెక్కాల, నారాయణ రెడ్డి తలకొల, రమేష్ రెడ్డి వీరభద్ర, తిరుమల రెడ్డి కందరి, వెంకట్ చిర్రాపు, రాజశేఖర్ చేజెర్ల, రవీంద్ర రెడ్డి కోటి, పార్ధ పెన్మత్స, పార్థ గోర్ల, సురేష్ గోపిడి, వెంకట సుబ్బా రెడ్డి భీమీ రెడ్డి, లోకనాథ రెడ్డి సిద్ధారెడ్డి గారి, విక్రమ్ దుడిపాల, శశిధర్ దేవరకొండు, రాఘవ రెడ్డి దట్ల, బాబు షేక్, సుబ్బరామి రెడ్డి పెనుమల్లి, మురళి పెనగలూరి, కొండారెడ్డి లెక్కాల, రామచంద్ర రెడ్డి సీలం, వాసు దేవా రెడ్డి దారుకుమల్లి, జయ బిజివేముల, విధ్యాసాగర్ రెడ్డి భోగిరెడ్డి, రవితేజ రెడ్డి ఒబిలి, శివ వల్లూరు, సుధాకర్ రెడ్డి మేనకూరు, ప్రసాద్ రెడ్డి నాగరపు, నాగార్జున రెడ్డి దారుకామిల్లి, ఆర్.బి.ఎస్. రెడ్డి, చైతన్య రెడ్డి నల గార్లకు ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
నాటా (NATA) మాజీ అధ్యక్షులు డాక్టర్ కోర్సపాటి శ్రీధర్ రెడ్డి (Dr. Sridhar Reddy Korsapati), కార్టర్ రక్త సంరక్షణ శిభిరాన్ని సందర్శించి నిర్వకులను, రక్తదాతలను, సమన్వయకర్తలను, స్వచ్ఛంద సేవకులను అభినందించారు.ఈ సందర్భంగా, యూఎస్ఏ వైఎస్సార్సీపీ కన్వీనర్ కృష్ణ రెడ్డి కోడూరు (Krishna Reddy Koduru) మాట్లాడుతూ, “వైఎస్ఆర్ గారి ఆశయాలను అనుసరిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మాకు గర్వంగా ఉంది” అని అన్నారు.
యూఎస్ఏ వైఎస్సార్సీపీ (YSRCP USA) కన్వీనర్ శివ అన్నపరెడ్డి (Siva Annapureddy) మాట్లాడుతూ, “వై.ఎస్.ఆర్. గారు ప్రజల కోసం చేసిన సేవలు అపారమైనవి. ఆయన స్ఫూర్తితో ఇలాంటి రక్తదాన శిబిరాలు నిర్వహించడం ద్వారా మనం ఆ సేవలను కొనసాగించవచ్చు” అని తెలిపారు. డల్లాస్ Y.S.R.CP పార్టీ ప్రముఖులైన సుబ్బారావు కొండు వై.ఎస్.ఆర్. గారి ఆశయాలకు అనుగుణంగా ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో భాగం కావడం, ఆయన ప్రజలకు చేసిన సేవలను కొనసాగించడం చాలా ఆనందంగా ఉంది” అని అన్నారు.
ప్రసాద్ రెడ్డి నాగారపు, శ్రీనివాస్ ముక్క, యెల్లారెడ్డి చలమల, భాస్కర్ రెడ్డి గడికోట, నాగేశ్వర్ రెడ్డి వెన్నపూస, మరియు శివ శంకర్ రెడ్డి పోతన ఈ రక్తదాన శిబిర (Blood Donation Drive) కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.