Somerset County, New Jersey, May 31, 2026: పిల్లల్లో అంధత్వ నివారణే ధ్యేయంగా, గత 50 ఏళ్లుగా నిరంతరాయంగా విశేష సేవలందిస్తున్న ‘ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ (Eye Foundation of America) సంస్థకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అండగా నిలిచింది. అంధత్వ రహిత సమాజ స్థాపనలో భాగంగా $10,000 భారీ విరాళాన్ని (Donation) అందిచింది. ఇటీవల జరిగిన ఒక ప్రత్యేక సేవా, సాంస్కృతిక కార్యక్రమంలో నాట్స్ ప్రెసిడెంట్ శ్రీహరి మందడి (Srihari Mandadi), నాట్స్ నాయకుల బృందం కలిసి ఈ విరాళానికి సంబంధించిన మొత్తాన్ని చెక్కు రూపంలో అధికారికంగా ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ శ్యామ్ మద్దాళికి అందించారు.
ఈ కార్యక్రమంలో నాట్స్ నాయకులు శేఖరం కొత్త, శ్రీనివాస్ గుత్తికొండ (Srinivas Guthikonda), శ్రీధర్ అప్పసాని (Sreedhar Appasani), ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni), గంగాధర్ దేసు, బాపు నూతి (Bapu Nuthi), రాజ్ అల్లాడ, హరి బుంగటావుల, టిపి రావు, బిందు యలమంచిలి, శ్యామ్ నాళం, శ్రీనివాస్ భీమినేని, కిరణ్ మందడి, వంశీ కొప్పురావూరి తదితరులు పాల్గొన్నారు. ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా చేస్తున్న సేవలను నాట్స్ నాయకులు అభినందించారు.
ఐ పౌండేషన్ ఆఫ్ అమెరికా (Eye Foundation of America) వ్యవస్థాపకులు వి.కె. రాజు, ప్రెసిడెంట్ లీలీ వి. రాజు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు శ్యామ్ మద్దాళి (Sam Maddali), శేఖర్ వెంపరాల, శ్రీను మద్దులలు అంధత్వ నివారణకు చేస్తున్న కృషిని నాట్స్ నాయకులు (NATS Leaders) ప్రత్యేకంగా ప్రశంసించారు. పిల్లల కళ్లల్లో కాంతిని నింపే ఇలాంటి మహత్కార్యాల్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఎలాంటి లాభాపేక్ష లేని ఇలాంటి ఉచిత వైద్య సేవలను భారతదేశంలోని కంటి సమస్యలున్న పేదలందరికీ చేరేలా ప్రచారం చేయాలని నాట్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
రాజమండ్రిలో $20 మిలియన్లతో సరికొత్త క్యాంపస్
డాక్టర్ వి.కె. రాజు నేతృత్వంలోని గౌతమి ఐ ఇన్స్టిట్యూట్, ఈ 50 ఏళ్ల మైలురాయి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాజమండ్రి (Rajamahendravaram) లో 20 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో సరికొత్త అంతర్జాతీయ స్థాయి భవనాన్ని నిర్మిస్తోంది. ఈ క్యాంపస్ ద్వారా దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వచ్చే పేద రోగులకు పూర్తి ఉచితంగా కంటి ఆపరేషన్లు, చికిత్సలు అందించనున్నారు. అంతే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం అత్యుత్తమ ఆప్తమాలజిస్టులకు (కంటి వైద్యులకు) ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు