Kuppam, Andhra Pradesh: కుప్పంలో కోటి రూపాయలు వ్యయంతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేసామని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ తెలిపారు. ఈ కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ఏర్పాటుకు APTS కార్పొరేషన్ ఆర్ధిక సహకారం అందించింది.
కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ KADA సహకారంతో కుప్పంలో APTS ఇంత మంచి కార్యక్రమం చెయ్యటం సంతోషం ఉందన్నారు.
కుప్పం మున్సిపాలిటీలోని స్వర్ణ నవదిశ సెంటర్‌లో కోటి రూపాయల వ్యయంతో రెండు అంతస్తుల లో అన్ని రకాల టెక్నాలజీ వసతులతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ (Co-Working Space Center) మరియు డిజిటల్ లైబ్రరీ (Digital Library) ని ఏర్పాటు చేశారు.
ఈ కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీ ని కుప్పంలో ఏర్పాటు చేయటానికి KADA (కుప్పం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ – Kuppam Area Development Authority) సహకారంతో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (Andhra Pradesh Technology Services – APTS) కార్పొరేషన్ నిధులు అందజేసింది.
ఈ సెంటర్ వల్ల విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, చిన్న వ్యాపారవేత్తలు మరియు ఫ్రీలాన్సర్లు లబ్ధి పొందుతారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి, పేద కుటుంబాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. యువతకు, కొత్తగా స్టార్టప్‌లు (Startups) పెట్టే వారికి తక్కువ ఖర్చుతో ఆఫీసు వాతావరణం కల్పించడం, డిజిటల్ చదువులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం.
కుప్పం (Kuppam) లో ఇంత మంచి కార్యక్రమానికి ఆర్ధిక సహకారం అందించటం ఎంతో సంతోషంగా ఉందని మన్నవ మోహన కృష్ణ (Mannava Mohana Krishna) పేర్గోన్నారు. యువతకు ఉపయోగపడే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమానికి తోడ్పాటును అందించిన APTS ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు.