అమెరికాలోని డల్లాస్ నగర ప్రవాసాంధ్రులు నవంబర్ 21న సమావేశమయ్యారు. తెలుగింటి ఆడబిడ్డ, తెలుగు జాతి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం అన్న ఎన్టీఆర్ కుమార్తె, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహధర్మచారిణి నారా భువనేశ్వరికి అసెంబ్లీ సాక్షిగా జరిగిన అవమానానినికి నిరసన తెలియజేసారు.
ఆదివారం సాయంత్రం జరిగిన ఈ సమావేశంలో ఎన్నారై తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ దేవాలయం లాంటి అసెంబ్లీలో వైకాపా నాయకులు ఒక మాతృమూర్తిని ఉద్దేశించి అత్యంత హేయమైన పదజాలంతో దూషించడం అత్యంత నీచమైన చర్య అని అన్నారు. అంతేకాకుండా అది కేవలం భువనేశ్వరికి మాత్రమే కాకుండా యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం అని తెలియజేసారు. ఇటువంటి దారుణానికి పాల్పడిన కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వల్లభనేని వంశి మరియు అంబటి రాంబాబు లు వొళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని లేదంటే త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఇర్వింగ్ లోని మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్ లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.