Philadelphia, Pennsylvania, August 9, 2026: అమెరికాలోని ఫిలడెల్ఫియా–నారిస్టౌన్‌లో ఆదివారం జరిగిన కమ్యూనిటీ గాదరింగ్‌లో ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (Andhra Pradesh Non-Resident Telugu Society – APNRT) ఆధ్వర్యంలో కమ్యూనిటీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఇటీవల APNRT ఫిలడెల్ఫియా సిటీ కోఆర్డినేటర్‌గా నామినేట్ అయిన అనూష ముసులూరి కార్యక్రమంలో పాల్గొని, ప్రవాస ఆంధ్రులకు APNRT ద్వారా అందిస్తున్న వివిధ కమ్యూనిటీ సర్వీసులు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమాచారం, APNRTలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగా, స్థానిక తెలుగు NRI లు APNRT నిర్వహిస్తున్న వాట్సాప్ కమ్యూనిటీ గ్రూపుల్లో చేరి, సంస్థ అందిస్తున్న సేవలు, కార్యక్రమాలు మరియు ముఖ్యమైన సమాచారాన్ని సులభంగా పొందే విధానం గురించి వివరించారు. ప్రవాస ఆంధ్రుల సమస్యలను సంబంధిత ప్రభుత్వ విభాగాల దృష్టికి తీసుకెళ్లడంలో APNRT అందిస్తున్న సేవలను ఆమె వివరించారు.
ఈ కార్యక్రమంలో Andhra Pradesh Non-Resident Telugu Society (APNRT) కోఆర్డినేటర్లు రవితేజ ముత్తు, నార్త్ ఈస్ట్ రీజినల్ కోఆర్డినేటర్లు రాధాకృష్ణ ముల్పూరి, శ్రీధర్ సాదినేని తదితరులు పాల్గొని, APNRT కార్యకలాపాలు మరియు ప్రవాస ఆంధ్రులకు అందుబాటులో ఉన్న సేవలపై వివరాలు అందించారు.
స్థానికంగా నివసిస్తున్న తెలుగు ప్రజలను APNRT (Andhra Pradesh Non-Resident Telugu Society) తో అనుసంధానం చేసి, వారికి అవసరమైన సమాచారం, సేవలు సులభంగా అందేలా భవిష్యత్తులో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.