ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ‘తానా’ 23వ మహాసభలు ఫిలడెల్ఫియా మహానగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో అంజయ్య చౌదరి లావు (Anjaiah Chowdary Lavu) అధ్యక్షతన, రవి పొట్లూరి కన్వీనర్ గా ఘనంగా నిర్వహించనున్న విషయం అందరికీ తెలిసిందే.
తానా మహాసభలకన్వీనర్రవి పొట్లూరి (Ravi Potluri) సారధ్యంలోని బృందం ఇప్పటికే ఇండియాలో రెండు తెలుగు రాష్ట్రాలలోని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులను ముఖాముఖీగా కలిసి ఆహ్వానపత్రాలు అందజేశారు. అలాగే తానా మహాసభల కమిటీల సభ్యులు తమ పరిధిలో సమావేశమవుతూ పనులు చక్కబెడుతున్నారు.
ఇప్పటికే టాలీవుడ్, రాజకీయ, సాహిత్య, విద్యా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు తానా మహాసభలకు రానున్నారు. వీరితోపాటు బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లి మహాసభలకు క్రేజ్ పెంచేలా నందమూరి బాలక్రిష్ణ ని తీసుకురావడానికి తానా (TANA) లీడర్షిప్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి.
తెలుగు సినీ రంగంలో ప్రస్తుతం నందమూరి బాలక్రిష్ణ తన కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నారు. ఒక పక్క హిందూపూర్ శాసనసభ్యునిగా, మరోపక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా సేవలందిస్తూనే వరుస సూపర్ హిట్ సినిమాలతో పాటు ఇండియాలోనే నంబర్ వన్ షోఅన్స్టాపబుల్ విత్ ఎన్.బి.కె (Unstoppable with NBK) షో తో దూసుకెళుతున్నారు. కాబట్టి తానా మహాసభలకు బాలయ్య వస్తే బాగుంటుందని తలచి ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
బాలయ్య కూడా ఇంతకు ముందు తానా సభలకి వచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో బాలయ్య ని ఆహ్వానించడానికే తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు షార్ట్ ట్రిప్ లో మొన్న ఇండియా బయలుదేరి వెళ్లినట్లు టాక్ నడుస్తుంది. ఏదేమైనప్పటికీ బాలయ్య తప్పకుండా వస్తారని, తానా సభలకు విపరీతమైన క్రేజ్ తీసుకువస్తారని, ఇక రచ్చ రచ్చే అంటున్నారు తానా సభ్యులు.