Connect with us

Movies

వకీల్‌ సాబ్ విడుదల విషయంలో వివాదం

Published

on

ఇంకొన్ని గంటల్లో పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా విషయంలో వివాదం నెలకొంది. మిగతా హీరోల సినిమాలకు టికెట్ రేట్లు పెంచేందుకు అవకాశం ఇచ్చి తమ హీరో సినిమాకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సీరియస్‌ అవుతున్నారు. పెద్ద సినిమాలకు పండగ టైమ్‌లో అదనపు షోలకు అనుమతులు ఇస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జీవోలు విడుదల చేసేవి. అయితే ఉగాదికి విడుదల కాబోతోన్న వకీల్‌ సాబ్‌ విషయంలో మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నారు.