Connect with us

News

Startups, Investments, AI పై యువతరానికి దిశానిర్దేశం @ TTA Seva Days

Published

on

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. TTA Founder Pailla Malla Reddy Garu, Advisory Consul Chair – Vijayapal Reddy గారు, Co-Chair – Mohan Patalolla గారు, Member – Bharat Reddy Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రెసిడెంట్ వంశిరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈసంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు ప్రజలను కోరారు.

అందులో భాగంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ T -హబ్ లో Startup Eco System in Telangana, Investment Opportunities in Tier 2 Cites in Telangana, Evolution of Al and it’s Impact అనే అంశాలపై సెమినార్ జరిగింది. దీనిలో Sri Jayesh Ranjan, IAS is the Principal Secretary for Information Technology, Telangana గారు, Smt. Rama Devi Garu Director, Emerging Technologies, Telangana గారు, Shri. Ramesh Loganathan Professor CoInnovation/Outreach at IIIT Hyderabad గారు పాల్గొని ప్రసంగించారు.

TTA సేవా డేస్ కార్యక్రమం రెండవరోజు T-HUB తో పాటు తన ఉనికిని తెలంగాణ అంతటా నిరూపించుకుంది. T-HUB ఎన్నో సమావేశాలు చూసి ఉండవచ్చు ఇది వరకు, కానీ ఈ సమావేశం తో T-HUB తను ఏర్పడ్డ లక్ష్యాన్ని అందుకుందా అనే ఆలోచన వచ్చింది. పాల్గొన్న యువ పారిశ్రామిక వేత్తల సమూహాన్ని చూసి అందరూ చిన్న చిన్న కుగ్రామాల నుండి అగ్రదేశాల శిఖరాలను అదిపుచ్చుకున్న శ్రమైక జీవన సారదులు. మహిళా పారిశ్రామిక వేత్తల గళం కార్యక్రమాన్ని మరో మెట్టు పైకి ఎదిగేలా చేసింది.

TTA.సేవా డేస్ ప్రోగ్రాం లో హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి గారు సేవలందిస్తున్నారు. తను తనదైన శైలిలో తన ప్రయాణం వరంగల్ లోని ఒక మారుమూల కుగ్రామం నుండి అరిజోనా లోని ఫీనిక్స్ కు చేరిన తీరు క్లుప్తంగా వివరించి యువ పారిశ్రామిక వేత్తల ను ఆకట్టుకున్నారు. ఒక మహిళగా తాను కుగ్రామం నుండి విదేశాలలో ఎంప్లాయిమెంట్ సృష్టించిన తన విజయ గాద అందరినీ అకుట్టుంది. ఒక్కొక్కరిది ఒక్కోక్క విజయ గాద. TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి గారు, ద్వారక నాద్ గారు, ఇలా ఎంతో మంది తమ ప్రయాణాన్ని కుగ్రామాల నుండి విదేశీ విహంగాలు వీక్షించిన వారే.

ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ ఇచ్చేది ఒకటే సందేశం తెలంగాణలో మేము వచ్చిన కుగ్రామల కు తిరిగి ఏదో ఇచ్చేయాలని. అది యుకులకు ఉపాధి అవకాశాలు కల్పించలనే లక్ష్యం మాత్రమే. ముఖ్య అతిది Smt. రమాదేవి డైరెక్టర్, ఇంజనీరింగ్ టెక్నాలజీ gout of తెలంగాణ గారిని TTA నుండి Shiva Reddy Kolla – TTA Joint Secretary గారు పరిచయం చేసారు. మరో ముఖ్య అతిధి Sri Jayesh Ranjan, IAS is the Principal Secretary for Information Technology, Telangana గారు వర్చువల్ గా అటెండ్ కాగా వారిని TTA నుండి Manohar Bodke – Joint Treasurer గారు పరిచయం చేశారు.

వర్చువల్ గా మాట్లాడిన జయేష్ రంజన్ AI లో చేయాల్సిన కృషిని వివరించారు. తదనంతరం సభను అడ్రస్ చేసిన ముఖ్య అతిది Smt. Rama Devi Garu Director, Emerging Technologies, Telangana గారు ఈ సమాజం లో ఉన్న అతి పెద్ద సమస్య ఆక్సిడెంటల్ మరణాలని అవి రోడ్డు పై జరిగి పూర్తి కుటుంబాలను రోడ్డు పైకి లాగుతున్నాయని తెలిపారు. రైతు బంధు, ధరణి లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలలో Ai తన సత్తా చాటాల్సిన అవసరాన్ని గుర్తు చేసారు.

Shri. Ramesh Loganathan Professor CoInnovation / Outreach at IIIT Hyderabad గారు Eco సిస్టమ్ గురించి వివరించారు. భారత్ లో జరుగుతున్న అనేక రీసెర్చ్ ల గురించి వివరించారు. TTA నుండి జ్యోతిరెడ్డి దూదిపాల గారు ముఖ్య అతిథి రమాదేవి గారిని శాలువాతో మరియు బొకే తో సన్మానించారు. మరో ముఖ్య అతిథిగా వచ్చిన ప్రొఫెసర్ రమేష్ గారిని INDIAN నేషనల్ కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు శాలువాతో సన్మానించారు. కార్యక్రమాన్ని తన భుజస్కందలపై నడిపించిన TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి గారు చివరగా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, INDIAN కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో – కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రసిడెంట్ గా వంశిరెడ్డి కంచరకుంట్ల గారు మరియు ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు, కార్యదర్శిగా కవితారెడ్డి గారు భాద్యతలు నిర్వహిస్తున్నారు.

సేవా డేస్ లో పాల్గొన్న TTA సభ్యులు

Shiva Reddy Kolla – Joint Secretary
Manohar Bodke – Joint Treasurer
Pradeep Mettu – National Coordinator
Ganesh Veeramaneni – Ethics Committee Director
Sangeetha Reddy – Board of Director
Venkat Gaddam – Board of Director
Pradeep Boddu, Abhilash Reddy,
Anil Arraballi, Vani Gaddam
Sridhar Chaduvu, Aahlaad Kareddy

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected