Connect with us

Festivals

ఘనంగా TTA బతుకమ్మ సంబరాలు @ Charlotte, North Carolina

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, Telangana American Telugu Association, ఫౌండర్ డా.పైళ్ల మల్లారెడ్డి గారి అశీసులతో తెలంగాణ (Telangana) సంస్కృతి సంప్రదాయాలను అమెరికా అంతటా ఘనంగా నిర్వహిస్తున్న ఏకైక సంస్థ టీటీఏ.

ఇందులో భాగంగా అడ్వైసరీ చైర్ డా విజయపాల్ రెడ్డి, అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల, మెంబర్ భరత్ రెడ్డి మాదాడి లు తెలంగాణ కి ప్రీతీ పాత్రమైన బతుకమ్మ (Bathukamma) సంబరాలని ఘనంగా జరపాలని నిర్ణయించారు.

ప్రెసిడెంట్ వంశీ రెడ్డి (Vamshi Reddy) అధ్యక్షతన జరిగిన టిటిఎ బతుకమ్మ సంబరాలకి అమెరిక లో వివిధ నగరాలో జనం పెద్ద ఎత్తున పోటెత్తారు. టిటిఎ ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది స్వంత నగరమైన షార్లెట్ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి.

మీడియా కమ్యూనికేషన్ డైరెక్టర్ నిశాంత్ సిరికొండ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ శ్రీకాంత్ గాలి, అభిలాష్ ముదిరెడ్డి, శివ కారుమూరి, అహలాద్ రెడ్డీ నేతృత్వంలో టిటిఎ షార్లెట్ టీం గ్రేడి కోల్ సెంటర్ నందు అదివారం నిర్వహించిన బతుకమ్మ సంబరాలు ఏడు వేల మంది ఆహుతులతో కిక్కిరిసింది.

విచ్చేసిన వారందరు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు అట పాటలతో మహిళలు బతుకమ్మ పండుగని అంగ రంగ వైభమంగా జర్పుకున్నారు. వచ్చిన వారికి టిటిఎ (Telangana American Telugu Association) చార్లొట్ వాలంటీర్లంతా చక్కని ఏర్పాటు చేశారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన టిటిఎ (TTA) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రేసిడెంట్ నరసింహ రెడ్డి దోంతి రెడ్డి గారు మరియు జె మీడియా అధినేత నరేందర్ రాజు గారికి టిటిఏ షార్లెట్ (Charlotte) టీమ్ అభినందనలు తెలియ చేశారు.

టిటిఎ చార్లొట్ టీం: అరుణ్ రెడ్డి కొత్తూరు, అంకుష్ వీర్రెడ్డి, శరన్ కందుకూరి, దిలీప్ శ్యాసని, ప్రమోద్, రాఘవేందర్ ఛామల, ప్రవీణ్ రెడ్డి, నరేంద్ర దేవరపల్లి, భరత్ జిల్లా, వెంకట్ జమ్ముల, భరద్వాజ్, సతీష్ సిరికొండ, రమేష్ చింతకుంట్ల, శిరీష చింతకుంట్ల, దీప్తి మిర్యాల.

error: NRI2NRI.COM copyright content is protected