Connect with us

Financial

వ్యక్తిగత టాక్స్ ప్రణాళికలపై తానా ఆధ్వర్యంలో సెమినార్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఆధ్వర్యంలో వ్యక్తిగత టాక్స్ ప్రణాళికలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సెమినార్లో సుమారు 150 మందికి పైగా పాల్గొన్నారు. డిసెంబర్ 16న తానా సంయుక్త కార్యదర్శి మురళి తాళ్లూరి సమన్వయపరిచిన ఈ సెమినార్ కు వక్త ఏజి ఫిన్ టాక్స్ అధినేత అనిల్ గ్రంధి.

తానా జాయింట్ సెక్రటరీ మురళి తాళ్లూరి స్వాగతోపన్యాసం అనంతరం ఈ సెమినార్ వక్త అనిల్ గ్రంధి ని పరిచయం చేసారు. అనిల్ తన ప్రొఫైల్ మరియు డిస్క్లైమర్ ని క్లుప్తంగా వివరించి సెమినార్ ప్రారంభించారు.

అంకుల్ శామ్ ఐ ఆర్ ఎస్ తో ఇబ్బందులు రాకుండా లీగల్ గా అనుసరించాల్సిన సూత్రాలు, టాక్స్ సేవింగ్స్ టిప్స్, రిటైర్మెంట్ ప్లానింగ్, రాత్ ఐ ఆర్ ఎ మార్పులు, ఎఫ్బార్ ఫైలింగ్, తదితర అంశాలపై అనిల్ సుదీర్ఘంగా వివరించారు. అలాగే సెమినార్లో పాల్గొన్నవారి సందేహాలను నివృత్తి చేసారు. చివరిగా తానా సంయుక్త కార్యదర్శి మురళి తాళ్లూరి వక్త అనిల్ కి, పాల్గొన్నవారికి, అలాగే ఈ వెబినార్ నిర్వహణలో లో తనకు సహాయపడిని తానా లీడర్షిప్ కు ధన్యవాదాలు తెలిపారు.

సెమినార్ పూర్తి వీడియో కొరకు ఈ లింక్ పై క్లిక్ చెయ్యండి. https://www.facebook.com/1698116605/videos/602328014332453/

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected