Connect with us

Elections

తెలంగాణ & ఆంధ్ర ఎలక్షన్స్, మధ్యలో తానా ఎన్నికలు, Jumbo jet list of contestants

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) తదుపరి నాయకత్వాన్ని సెలెక్షన్ ప్రాసెస్ ద్వారా బోర్డు సభ్యులు ఎంపిక చేసినప్పటికీ, కొందరు కోర్టుకి వెళ్లడంతో ఎన్నికలు నిర్వహించాల్సిందిగా మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్ట్ గత సెప్టెంబర్ లో తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వార్త కోసం ఇక్కడ (సెలెక్షన్ వద్దు, ఎలక్షన్ ముద్దు; Court says TANA Leadership Null & Void) క్లిక్ చేయండి.

90 రోజులలో ఎన్నికలు నిర్వహించాలంటూ మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్ట్ ఆదేశించడంతో ఇక గత్యంతరం లేక తానా బోర్డు సభ్యులు రెండోసారి ఎలక్షన్ నగరా మోగించారు. అక్టోబర్ 31న నలుగురు సభ్యులతో కూడిన నామినేషన్స్ & ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ వార్త కోసం ఇక్కడ (తానాలో రెండోసారి మోగిన ఎలక్షన్ నగరా, మొదటిసారి ఎలక్ట్రానిక్ వోటింగ్ పద్దతి) క్లిక్ చేయండి.

ఎప్పటిలానే అన్ని పదవులకు తీవ్ర పోటీ నెలకొనడంతో కొంతమంది (ముఖ్యంగా బ్యాక్అప్) నామినేషన్స్ ఉపసంహరించుకున్నప్పటికీ జంబో జెట్ అంత ఉంది కంటెస్టెంట్స్ లిస్ట్ (Jumbo jet list of contestants). ఇరు వర్గాలు కూడా పెద్దగా వెనక్కి తగ్గక పోవడంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతర జాబితా వివరాలు కింద చూడవచ్చు.

4 గురు బోర్డు సభ్యులను, 29 మంది కార్యనిర్వాహక సభ్యులను మరియు 7 గురు ఫౌండేషన్ సభ్యులను తానా సభ్యులు ఎన్నుకోవలసిన తరుణంలో మొత్తం 40 పదవులకు చాలా మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ముఖ్యంగా నరేన్ కొడాలి (Naren Kodali) మరియు సతీష్ వేమూరి (Sateesh Vemuri) ప్యానెల్స్ మధ్య పోటీ నడుస్తుంది.

అడపాదడపా నలుగురు ఏకగ్రీవం కూడా అయ్యారు. కొందరు పెద్ద తలకాయలు (Dr. Prasad Nalluri, Sreenivas Gogineni) కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. దీంతో TANA Executive Vice President పదవికి చతుర్ముఖ పోటీ నడుస్తుంది అనుకోవాలి. బ్యాలట్స్ ఫైనలైజ్ అయ్యే రోజుకి పరిస్థితులు ఏమన్నా మారతాయేమో వేచి చూడాలి.

ఇండియాలో ఇప్పుడే 4 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు (Telangana Assembly Elections) రసవత్తరంగా ముగియడం, మరో 4 నెలల్లో అంతకంటే ఎక్కువ ఉత్కంఠతను రేపే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ఉండడం వంటి పరిస్థితుల్లో, మధ్యలో తానా ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.

ఇప్పటి వరకు తానా (Telugu Association of North America – TANA) చరిత్రలో ఎప్పుడూ నిర్వహించని, సవాలుతో కూడిన ఎలక్ట్రానిక్ వోటింగ్ (Electronic Voting) పద్దతిలో ఈ ఎలక్షన్స్ నిర్వహిస్తుండడంతో ఏమవుతుందోనని తానా ఓటర్లు కూడా కుతూహలంగా ఉన్నారు. వచ్చే 2024 సంక్రాంతి పండుగ రోజున విజేతలెవరో తేలిపోతుంది.

Board of Directors Contestants
Sai Bollineni
Srinivasa Rao Lavu
Ravi
Potluri
Sirisha Tunuguntla
Mallikarjuna Vemana
Srinivas Vuyyuru
Venkata Ramana
Yarlagadda

Executive Committee Contestants
Executive Vice President
Sreenivasa Gogineni
Naren Kodali
Prasad Nalluri
Sateesh Kumar Vemuri
Secretary
Venkata (Raja) Kasukurthi
Ashok Babu Kolla
Joint Secretary
Venkat Koganti
Vamsi Krishna Vasireddy
Joint Treasurer
Sunil Pantra
Shashank Yarlagadda
Community Service Coordinator
Lokesh Konidala
Rajani Akurati
Cultural Service Coordinator
Rajanikanth Kakarla
Uma R Katiki
Women Services Coordinator
Sohini Ayinala
Madhuri D Yeluri
Councilor – At large
Pradeep Kumar Gaddam
Sateesh Kommana
International Coordinator
Sridhar Kumar Kommalapati
Tagore Mallineni
Sports Coordinator
Sriramamurthy Alokam
Nagamalleswara Rao Panchumarthi
RR – New England
Mounika Manikonda
Krishna Prasad Sompally
RR – New York
Srinivas Bharthavarapu
Krishna Deepika Sammeta
RR – New Jersey
Sreenath Konanki
Rama Krishna Vasireddy
RR – Mid Atlantic
Bhaskara Malineni
Venkateswara Rao Singu
RR
– Capital
Sateesh Chinta
Ramesh Mandalapu
RR – Appalachian
Purnachandra Babu Kondragunta
Rajesh Yarlagadda
RR – Southeast
Bhanu Prakash Gullapalli
Madhukar B. Yarlagadda
RR – North
Vishnu V Jampala
Neelima Manne
RR – Ohio Valley
Pradeep Kumar Chandanam
Siva Linga Prasad Chava
RR – Midwest
Chiranjeevi Galla
Sriharsha Garikapati
RR
– DFW 
Paramesh Devineni
Satish Babu Kotapati
RR – Southwest
Kalpana Nukavarapu
Leela Krishna Sumanth Pusuluri
RR – North Central
Radha Krishna Pydi
Sriman N. Yarlagadda
RR – Southern California
Hemakumar Gotti
Suresh Mallina
RR– Northern California
Venkata Rao Adusumalli
Sreedhar Chava
RR
– North West
Srinivasa Abburi
Suresh
Patibandla

Foundation Trustee Contestants
Ramakrishna Chowdary Allu
Bhakta V Balla
Suresh Babu Channamallu
Srinivasa Rao Kukatla
Satyanarayana V Manne
Ravi Kiran Muvva
Nagaraju Nalajula
Ram Sumanth Ramsetti
Ravi Samineni
Raja Surapaneni
Srinivasa
Yenduri

Foundation Trustee (Donor) Contestants
Vikram Indukuri
Srinivas Chand Gorrepati
Sridhar Gottipati
V SureshBabu
Puttagunta

Nominations Not Approved
BOD Non Donor: Raja Ravulapalli
Foundation Trustee: Ganga Anand Akkineni
Treasurer: Bharath Maddineni
(Based on BOD Directive)

Nominations Withdrawn
BOD Donor: Ravi K. Mandalapu
BOD Non-Donor: Kiran Kumar Kothapalli, Devendra Rao Lavu
Women Services Coordinator: Padma Bhogavalli
RR Southwest: Sekhar Manchineni
Foundation Trustee: Satish C Meka
Foundation Donor Trustee: Kiran
Amirineni

Unanimous
BOD Donor: Hema Chandra Sekhar Kanuru
Treasurer: Murali Talluri
RR South Central: Emesh Chandra Gutta
RR Rocky Mountains: Sekhar
Kolla

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected