Connect with us

Associations

న్యూజెర్సీలో దిగ్వి’జయ’oగా తానా ఫౌండేషన్ 5కే వాక్

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబెర్ 8 న న్యూజెర్సీ లోని జాన్సన్ పార్క్‌లో 5కే వాక్‌ను నిర్వహించారు. పుట్టి పెరిగిన సొంత ఊరి ప్రజల సేవ కోసం తానా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఈ వాక్ లో సుమారు 200 మంది పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు పేర్లు నమోదు చేసుకున్నవారికి బిబ్స్, టీషర్ట్స్ ఇవ్వడంతో కార్యక్రమం మొదలవగా, పిల్లలకోసం 1కే వాక్‌ పెద్దల కోసం 5కే వాక్‌ విజయవంతంగా నిర్వహించారు.

తదనంతరం బాలలు, మహిళలు మరియు పురుషుల విభాగాలలో మొదటి పదిమంది విజేతలకు తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్ళూరి, తానా మహిళా కో ఆర్డినేటర్ లక్ష్మీ దేవినేని చేతుల మీదుగా మెడల్స్ మరియు ట్రోఫీలు అందించారు. తానా న్యూయార్క్/న్యూజర్సీ రీజినల్ కోఆర్డినేటర్ విద్యాధర్ గారపాటి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. తానా రైతు కోసం పధకంలో భాగంగా రైతులకు అవసరమైన కిట్స్ మరియు భూమి పరీక్ష కు సంభందించిన కిట్స్ కోసం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమం విజయవంతం అయింది. ఈ 5కే వాక్‌ను నిర్వహించిన తానా న్యూజెర్సీ కార్యవర్గ సభ్యులు వంశీ వాసిరెడ్డి, రాజా కసుకుర్తి, రామకృష్ణ వాసిరెడ్డి, రత్నా ముల్పూరి, శ్రీనివాస్ ఓరుగంటి, ధ్రువ నాగండ్ల, సుధీర్ నారెపాలెపు, శ్రీనాధ్ కోనంకి, సుమంత్ రాంశెట్టి ,పృధ్వి చేకూరి, రాధా నల్లమల, శ్రీరాం అలోకం, రాజ్ వేండ్ర, విజయ నాదెళ్ళ, రేఖ ఉప్పలూరి తదితరులను అందరూ ప్రత్యేకంగా అభినందించారు.

వాక్ తదనంతరం అమ్మ కిచెన్ మరియు కోనసీమ రెస్టారెంట్ వారు అందించిన అల్పహార విందు అమోఘంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్నవారు తెలిపారు. స్థానిక సమర్పకులు ప్రియా కొర్రపాటి, సుధీర్ గడ్డిపాటి, లక్ష్మీ మోపర్తి, గోవర్ధన్ బొబ్బా లకు నిర్వాహకులు ప్రత్యేక కృతఘ్నతలు తెలిపారు. చివరిగా తానా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జయ శేఖర్ తాళ్ళూరి తానా ఫౌండేషన్ చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను గూర్చి వివరించారు. వేదికను అందించిన జాన్సన్ పార్క్ నిర్వాహకులు, వాలంటీర్లు మరియు ఈ వాక్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేయడంతో కార్యక్రమం ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected