Connect with us

Movies

నాట్స్ తెలుగమ్మాయి విజేతకి సినీ అవకాశం, శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి హామీ

Published

on

అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ‘నాట్స్’ చేపట్టిన నాట్స్ తెలుగమ్మాయి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. నాట్స్ తెలుగమ్మాయి పోటీల విజేతకు తమ సినిమాలో అవకాశం కల్పిస్తామని శ్యామ్ సింగరాయ్ సినిమా (Shyam Singha Roy) సినిమా నిర్మాత వెంకట్ ‌బోయినపల్లి తెలిపారు.

అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణకు నాట్స్ (North America Telugu Society) చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. నాట్స్ (NATS) అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా చేపట్టిన తెలుగమ్మాయి కార్యక్రమం ఎంతగానో ఆకట్టుకుందన్నారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘంనాట్స్’ అమెరికా తెలుగు సంబరాల్లో నిర్వహించే తెలుగమ్మాయి పోటీల్లో విజేత ఎవరైనా సరే వారికి నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ భవిష్యత్తులో నిర్మించే సినిమాల్లో అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected