Connect with us

Events

ఏప్రిల్ 15న ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) ఉగాది ఉత్సవాలు

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ ‘టాంటెక్స్’ ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 15 శనివారం రోజున నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో టాలీవుడ్ ప్లేబాక్ గాయని మనీషా ఎరబత్తిని (Manisha Eerabathini) మరియు తెలుగు ఐడల్ (Telugu Idol) 2022 రన్నరప్ గాయకులు రేణు కుమార్ (Renu Kumar) తమ గాత్ర మాధుర్యంతో అలరించనున్నారు.

టెక్సస్ (Texas) రాష్ట్రం, ప్లేనో (Plano) నగరంలోని స్థానిక ది గ్రాండ్ సెంటర్ (The Grand Center) లో నిర్వహించే ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం, సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాఫుల్ బహుమతులు, షాపింగ్ స్టాల్ల్స్, పండుగ పండుగ ప్రత్యేక భోజనం (Dinner) వంటి స్పెషల్స్ ఎన్నో ఉన్నాయి.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) నిర్వహిస్తున్న ఈ ఉగాది ఉత్సవాలకి క్రింది ఫ్లయర్లో ఉన్న క్యూఆర్ కోడ్ (QR Code) ని స్కాన్ చేసి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా టికెట్స్ (Tickets) కొరకు www.NRI2NRI.com/TANTEX-Ugadi-2023 ని సందర్శించండి. మరిన్ని మరిన్ని వివరాలకు ఫ్లయర్ చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected