Connect with us

News

ఫ్లోరిడా, టాంపా లో టీడీపీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం

Published

on

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపా నగరంలో తెలుగుదేశం పార్టీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఎన్ఆర్ఐ టీడీపీ యూఎస్ఏ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఫ్లోరిడా రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.

అనంతరం జయరాం కోమటి మాట్లాడుతూ.. ఇప్పటివరకు 26 రాష్ట్రాల్లో కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబునాయుడు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని అన్నారు. ఇక్కడున్న ప్రవాసాంధ్రులు తమతమ గ్రామాల్లోని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తిరగబడాలన్నారు. తెలుగునాట జరుగుతున్న సకల, సామాజిక, రాజకీయ, సాంస్కృతి ఉద్యమాలతో మమేకై తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుంది.

అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం ప్రజల పక్షానే పోరాడుతూనే ఉంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంత స్ఫూర్తితో పనిచేయాలన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ లక్ష్య సాధన కోసం తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రతిన పూనాలన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో ముందుచూపు లేదు. నేరం, రాజకీయం జంటగా అంటకాగుతున్నాయన్నారు. అవినీతి, స్వార్థ రాజకీయ విషకౌగిలిలో చిక్కిన రాష్ట్రానికి మూడున్నరేళ్లుగా ఊపిరాడటం లేదన్నారు.

మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఆనాడు ఎన్టీఆర్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 9 నెలల కాలంలో తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలుగుదేశం బావుటా ఎగురవేశారు. ప్రస్తుత జగన్ రెడ్డి పాలనలో అవినీతి, ఆశ్రిత పక్షపాతం పెరిగింది. తమ తప్పు తెలుసుకున్న ప్రజలు తిరిగి చంద్రబాబునాయుడుకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. జీ-20 దేశాల సదస్సు నిర్వహణపై ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో చంద్రబాబు విజన్ ను ప్రశంసించడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు.

తెలుగుదేశం పార్టీ టాంపా నగర అధ్యక్షుడిగా సుధాకర్ మున్నంగి, ఉపాధ్యక్షుడిగా రామ్మోహన్ కర్పూరపు, జనరల్ సెక్రటరీగా స్వరూప్ అంచె, ట్రెజరర్ గా చంద్ర పెద్దు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా నాగ సుమంత్ రామినేని, రీజనల్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా అజయ్ దండమూడిని నియమించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, శ్రీనివాస్ గుత్తికొండ, మన్నవ మోహన కృష్ణ, ప్రశాంత్ పిన్నమనేని, నాగేంద్ర తుమ్మల, అశోక్ యార్లగడ్డ, సుధీర్ వేమూరి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుమంత్ రామినేని, వేణుబాబు నిమ్మగడ్డ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected