మే డే (May Day) సందర్భంగా ఖతార్ (Qatar) మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వర్కర్స్ సపోర్ట్ ఇన్సూరెన్స్ ఫండ్ వారు ఘనంగా నిర్వహించిన “వర్కర్స్ ఇంటర్నేషనల్ డే సెలబ్రేషన్స్” కార్యక్రమంలో ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పలు సంస్థలు పాల్గొని కార్మిక సేవల పట్ల తమ అంకితభావాన్ని చాటుకున్నాయి.
ఈ ప్రతిష్టాత్మక వేదికపై, ఖతార్ (Qatar) లో తెలుగు కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) కి అవార్డు లభించడం గర్వకారణం. ఇది కేవలం ఒక సంస్థకు వచ్చిన గౌరవం మాత్రమే కాకుండా, విదేశాల్లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి తెలుగు కార్మికుడి శ్రమకు లభించిన గొప్ప గుర్తింపు.
ఈ సందర్భంగా తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) సంఘం అధ్యక్షుడు మైధం మధు గారు మాట్లాడుతూ, ఈ అవార్డును ఖతార్ (Qatar) లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అంకితం చేస్తున్నామని తెలిపారు. వారి శ్రమ, సహనం, అంకితభావమే ఈ గౌరవానికి నిజమైన కారణమని ఆయన పేర్కొన్నారు.
ఈ విజయానికి వెనుక కనిపించని ఎన్నో చేతులు, ఎన్నో త్యాగాలు, ఎన్నో గంటల కృషి దాగి ఉన్నాయి. తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) సంస్థ కోసం నిస్వార్థంగా సేవలందించిన ప్రతి సభ్యుడు, వాలంటీర్, మద్దతుదారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
వారి అంకితభావం, సేవా స్పూర్తి, ఐక్యత వల్లే ఈ గౌరవం సాధ్యమైంది. అలాగే, ఈ గౌరవాన్ని ఖతార్ (Qatar) లో నివసిస్తున్న ప్రతి తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నాము. వారి విశ్వాసం, మద్దతు, ప్రేమ మాకు నిరంతర ప్రేరణగా నిలుస్తున్నాయి.
ఈ అవార్డు ప్రతి తెలుగు (Telugu) కార్మికుడిదే. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతూ, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి, ప్రతి తెలుగు కార్మికుడికి అండగా నిలవడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేస్తున్నాము అని అన్నారు.