New England: ఫిలాంట్రపిస్ట్, సీఈఓ ఆఫ్ బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (Boston Group of Companies), మాజీ డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (APTA), డాక్టర్ సుబ్బు కోట (Dr. Subbu Kota) జన్మదినోత్సవము సెలబ్రేషన్స్ తోటి దద్దరిలిన బోస్టన్, న్యూ ఇంగ్లాండ్.
పిలాన్ట్రోపిస్ట్ బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ సుబ్బు కోట గారి ఎనభయి రెండవ జన్మదినోత్సవం (Birthday Celebrations) నియర్ అండ్ డియర్ ఘనముగా నిర్వహించారు. సుబ్బు కోట శుక్రవారం సాయంకాలం అందరితోటి సరదాగా గడిపారు.
అయన (Dr. Subbu Kota) జీవిత అనుభవాలు అందరితోటి సరదాగా పంచుకున్నారు, వచ్చిన ప్రతిఒక్కరి తోటి అయన అనుభవాన్ని చెప్పి అందర్నీ అలరించారు. అన్ని సంఘాలు వాళ్లు వచ్చి ఇలా జన్మదినమును గడపటం ఆయనకు ఒక తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అన్నారు.
అయన జీవితములో కలసిన సత్య సాయిబాబా (Sathya Sai Baba), అబ్దుల్ కలాం (A. P. J. Abdul Kalam) మరియు ఎందరో దేశాధ్యక్షులు సెలెబ్రేటిస్స్, ఒబామా టీం (Barack Obama) లో ఫోటో’స్ వీడియో రూపంలో చూసి అందరు ఆనందబాష్పాలు కురిపించారు. వీడియో చూసి సుబ్బు కోట అప్పుడు జరిగిన క్షణాలు గుర్తుకు తెచుకున్నారు.
తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) మాట్లాడుతూ.. ఒక్క సమర్ధనం ట్రస్ట్ క్రికెట్ ఫర్ ది బ్లైండ్ కే, మిలియన్ డాలర్స్ తన వంతుగా ఇచ్చి ఒక్కమాట కూడా ఎక్కడ చెప్పని, ఇలా తన ప్రయాణం లో ఎన్నో గుప్త దానాలు చేసిన మహా దాత సుబ్బు కోట అని కొనియాడారు.
మాజీ బోస్టన్ తెలుగు సంఘం అధ్యక్షులు రంజన్ వడ్లపట్ల, సుబ్బు కోట ఎందరికో చేసిన సహాయాలు గుర్తుకుతెచ్చుకున్నారు, దివాకర్ జంధ్యం (Divakar Jandyam) సుబ్బా కోట గొప్పతనాన్ని గుర్తుగా శాలువాతోటి సత్కరించారు.
చాలామంది మేము మాట్లుడుతాము అని పోటీ పడి మరి సుబ్బు కోట గారి గొప్పతన్నాని వర్ణించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) మల్లా రెడ్డి యానాల, రవికృష్ణ సుద్దపల్లి, మిట్టా స్ గ్రూప్ అధినేత విద్యాధర్ తమ అనుభవాల్ని పంచుకున్న వారిలో వున్నారు.
సత్యనారాయణ చందాన, సంపత్ కట్ట, విజయ్ బెజవాడ , గోపి నెక్కలపూడి, శేషు బాబు కొంతం, వేణు కున్నమనేని, రాజేంద్ర రెడ్డి కల్వల, వేణుగోపాల రెడ్డి ఆనంద్ గొర్రె, ఆనంద్ తాటి, చంద్ర శేఖర్ నల్లం, రామకృష్ణ పమిడిపాటి, త్రిభువన్ పారుపల్లి, రమేష్ జంగారెడ్డి తదితరులు ఉత్సాహముగా పాల్గొన్నారు.
చివరిగా కేక్ కటింగ్ తరువాత ఫిలాంట్రాపిస్ట్, సీఈఓ ఆఫ్ బోస్టన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, మాజీ డైరెక్టర్ ఆఫ్ అమెరికన్ ప్రోగ్రెసివ్ గ్రూప్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ (APTA), డాక్టర్ సుబ్బు కోట (Dr. Subbu Kota) గారు ఉత్సహముగా వేసిన జోక్ కి ఆ ప్రాంతమంతా ఈలలతోటి మారుమ్రోగింది.