Connect with us

Sports

క్రికెట్ టోర్నమెంట్‌కు నాట్స్ సహకారం: టీషర్టులు, ట్రోఫీలు అందించిన నాట్స్

Published

on

నవంబర్ 30: నార్త్ అమెరికా తెలుగు సొసైటీ ‘నాట్స్’ ఫ్లోరిడాలోని టాంపాలో టాంపా క్రికెట్ లీగ్ నిర్వహించిన అండర్ 15 యూత్ క్రికెట్ టోర్నమెంట్‌కు తన వంతు సహకారాన్ని అందించింది. స్థానిక రూరీ సాప్ట్ వేర్ టెక్నాలజీస్‌తో కలిసి విజేతలకు, క్రికెట్ ప్లేయర్లకు టీ షర్టులు, ట్రోఫీలు అందచేసింది. అండర్ 15 విభాగంలో పాల్గొన్న భారతీయ క్రీడాకారులకు నాట్స్ టాంపా బే విభాగం మద్దతు ఇచ్చి వారిలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో నాట్స్ టీ షర్టులు, ట్రోఫీలు, పతకాలు అందచేసింది.

అట్లాంటా జార్జియా, బ్లూమింగ్టన్ ఒహియో, ఆర్లాండో, టాంపా ఫ్లోరిడా లతో కూడిన నాలుగు జట్లు ఈ టోర్నమెంటులో తలపడ్డాయి. 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 64 మంది ఆటగాళ్ళు ఈ టోర్నమెంట్ లో ఉత్సాహంగా పాల్గొని తమలోని క్రికెట్ ప్రతిభను చూపించారు. టోర్నమెంట్‌ టైటిల్‌ను ఓర్లాండో నుండి ఫ్లోరిడా పాంథర్స్ గెలుచుకుంది. టాంపా జట్టు రన్నరప్‌గా రెండవ స్థానంలో నిలిచింది.

క్రికెట్ టోర్నమెంట్‌కు నాట్స్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని టాంపా క్రికెట్ లీగ్ కు చెందిన నితీష్ శెట్టి ప్రశంసించారు. నాట్స్, ఎస్.జి.ఐ.ఎస్ ఫిల్మ్స్, రోటరీ క్లబ్ ఆఫ్ న్యూ టాంపా, శ్రీనివాస్ మల్లాదిలకు నితీష్ శెట్టి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డు కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్/మార్కెటింగ్) శ్రీనివాస్ మల్లాది, నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ కాండ్రు తదితరులు ఈ టోర్నమెంట్‌కు సహకారం అందించారు. నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీధర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శేఖర్ అన్నే తో పాటు రవి గుమ్మడిపూడి, శ్రీనివాస్ కాకుమాను, రంజిత్ చాగంటి, మురళీ మేడిచర్ల తదితరులకు నాట్స్ టాంపా విభాగం ధన్యవాదాలు తెలిపింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected