Connect with us

Sports

క్రికెట్‌లో మహిళల దూకుడు, Philadelphia లో తానా మహిళల టోర్నమెంట్ జోష్

Published

on

Philadelphia, Pennsylvania: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో వరుసగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 19వ తేదీన ఆల్బర్ట్ సి మిల్లర్ పార్క్ వేదికగా నిర్వహించిన మొట్టమొదటి తానా మిడ్-అట్లాంటిక్ మహిళల క్రికెట్ టోర్నమెంట్ (Cricket Tournament) కు అపూర్వ స్పందన వచ్చింది.

వివిధ టీములు ఈ టోర్నమెంటులో పాల్గొని క్రీడాస్ఫూర్తిని (Sportsmanship), ప్రతిభను చాటాయి. మ్యాచ్‌లను సజావుగా, నిష్పాక్షికంగా నిర్వహించిన అంపైర్లు సురేష్ యలమంచి, వెంకటేష్ జాగర్లమూడి, శ్రీధర్ సాదినేని, చలం పావులూరి, ప్రసాద్ క్రొత్తపల్లి, వినీత్ తుమ్మల మరియు స్వర్జీత్ లకి మిడ్ అట్లాంటిక్ తానా టీమ్ అభినందనలు తెలియజేసింది.

ఈవెంట్ ను తొలి నుంచి ముందుండి నడిపిస్తూ, పూర్తిస్థాయి సమన్వయాన్ని, మద్దతును అందించిన మహిళా కోఆర్డినేటర్ దీప్తి కోక సేవలను నాయకులు ప్రత్యేకంగా కొనియాడారు. తానా (TANA) బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), సతీష్ తుమ్మల (Satish Tummala) టోర్నమెంటులో పాల్గొని క్రీడాకారులలో ఉత్సాహాన్ని నింపారు.

రోజంతా సేవలు అందించిన బృంద సభ్యులు సురేష్ యలమంచి, సునీల్ కోగంటి (Sunil Koganti), చలం పావులూరి, రంజిత్ మామిడి, ప్రసాద్ క్రొత్తపల్లి, కృష్ణ నందమూరి, గోపి వాగ్వాల, శ్రీధర్ సాదినేని, కట్టా చైతన్య మరియు క్రిషిత నందమూరిలను ఆయన అభినందించారు. ఈ టోర్నమెంట్‌కు ఉదారంగా స్పాన్సర్‌షిప్ (Sponsorship) అందించిన రామకృష్ణ తాడిశెట్టి గారికి ధన్యవాదాలు తెలిపారు.

తొలి మహిళల క్రికెట్ టోర్నమెంట్‌ను (Women Cricket Tournament) విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ, తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి (Dr. Naren Kodali), ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ లావు, బోర్డు డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ శివ చావ అభినందించారు.

విజేతలు

ఛాంపియన్స్: పవర్ బ్లేజెస్
రన్నరప్: టైటాన్స్
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: ఐశ్వర్య లచగరి
బెస్ట్ బ్యాటర్: నిత్య కేశవ
బెస్ట్ బౌలర్: ప్రియాంక రామిశెట
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: అజంతా తాడూరి
బెస్ట్ వాలంటీర్ ఆఫ్ ది డే: క్రిషిత నందమూరి

error: NRI2NRI.COM copyright content is protected