Connect with us

Celebrations

ఫ్లోరిడా టాంపా బే లో నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు

Published

on

అమెరికాలోని వివిధ నగరాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 నగరాల్లో పెద్డ ఎత్తున నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.

ఇందులో భాగంగా ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా బే లో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు వేడుకలు విజయవంతంగా నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి అందరికీ పంచారు.

ఏప్రిల్ 19న నిర్వహించిన ఈ టాంపా బే ఎన్నారై టీడీపీ కార్యక్రమంలో స్వరూప్, ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ మల్లాది, సుబ్రమణ్యం మేడికొండ, అజయ్ దండమూడి, నాగేంద్ర తుమ్మల తదితరులు పాల్గొన్నారు. జై చంద్రబాబు, జై తెలుగుదేశం వంటి నినాదాలతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

error: NRI2NRI.COM copyright content is protected