ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు ఛార్లెట్ (Charlotte, North Carolina) లో మే 16వ తేదీన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు దాదాపు 500 మందికిపైగా మహిళలు రావడం విశేషం.
అందులో తల్లితోపాటు, కూతుళ్ళు కూడా పెద్ద సంఖ్యలా ఈ వేడుకకు హాజరై సరికొత్త రికార్డును సృష్టించారు. ఓ వేడుకకు ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఇంతమంది మహిళలు రావడం ఇదే మొదటిసారని నిర్వాహకులు చెప్పారు.
ఆటలు, పాటలు, విందు భోజనాలు, డ్యాన్స్‌లు, ఇతర కార్యక్రమాలతో వేడుకలు కన్నులవిందుగా జరిగాయి. తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి (Naren Kodali) తోపాటు, జాయింట్ ట్రెజరర్ రాజేష్ యార్లగడ్డ (Rajesh Yarlagadda), కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
ఛార్లెట్ (Charlotte, North Carolina) లో ఉన్న తానా (TANA) హెల్త్ సర్వీసెస్ కో ఆర్టినేటర్ మాధురి ఏలూరి (Madhuri Yeluri) మొదటి నుంచి ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడంతోపాటు వచ్చినవారంతా ఎంజాయ్ చేసేలా ఏర్పాట్లను చేశారు.
ఛార్లెట్ లో ఉన్న తానా నాయకులు నాగ పంచుమర్తి (Naga Panchumarthi), ఠాగూర్ మల్లినేని (Tagore Mallineni), కిరణ్ కొత్తపల్లి (Kiran Kothapalli), రవి (నాని) వడ్లమూడి (Ravi Chandra Vadlamudi) తదితరులు కూడా ఈ వేడుక విజయవంతానికి కృషి చేశారు.
ఈ వేడుకకు అతిధిగా వర్జీనియా నుండి అందెలరవమిది ఫేమ్ ఇంద్రాణి దావలూరి (Indrani Davaluri) వచ్చారు. ఆమె తనప్రసంగంలో మహిళల (Women) ప్రాముఖ్యతను తెలియజేశారు. అలాగే సిన్సినాటి (Cincinnati, Ohio) నుండి ప్రత్యేకంగా విచ్చేసిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ‘అమ్మమ్మడు’ కూడా ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఆమె కూడా ఒక గేమ్ ను నిర్వహించి వచ్చినవారిలో ఉత్సాహాన్ని నింపారు. యాంకర్ స్రవంతి ప్రత్తిపాటి (Sravanthi Prattipati) తనదైన శైలిలో ఎంతో హుందాగా, ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని నడిపించడంతోపాటు వచ్చినవారితో వివిధ రకాలైన గేమ్స్‌ను నిర్వహించారు.
సింగర్ స్నిగ్ధ ఎల్లేశ్వరపు ఆలపించిన మధురమైన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన పద్మజ కొమ్మినేని, జ్యోత్స్న గంట, సౌమ్య శ్రీ తల్లాంకి, ఝాన్సీ అబ్బూరి (Jhansi Abburi), మరియు జ్యోత్స్న కాండ్లగుంటల అంకితభావాన్ని నిర్వాహకులు ప్రత్యేకంగా ప్రశంసించారు.