Connect with us

Celebrations

NTR@100 in DC: 100 రకాల తెలుగింటి వంటలు, ఏర్పాట్లపై సమీక్ష, సన్నాహక సమావేశం

Published

on

వాషింగ్టన్ డీసీ లో మే 21 ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు 2000 పైచిలుకు అన్న గారి అభిమానులు కుటుంబ సమేతంగా పాల్గొంటారని, ఆ మహనీయుని స్మరించుకొని, సామాజిక సేవా దృక్పధంతో ముందుకు సాగాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు, గౌరవ అతిధులుగా జయరాం కోమటి, మన్నవ సుబ్బారావు హాజరు కాబోతున్నారని తెలిపారు.

ఒక తరం గుండెల్లో కొలువైన దేవుడు, మరో తరం ఆత్మ గౌరవం తట్టి లేపిన ప్రజా నాయకుడు, నేటి తరానికి సమాజ శ్రేయస్సును పాటించాలని నిత్యం గుర్తుచేసే శత వసంతాల శకపురుషుడు అని, ఆయన ఆదర్శాలను, జీవితకాలం పాటించిన ప్రమాణాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిదాయకంగా పాటించాలని, అందుకే సుదూర ప్రాంతాలలో ఉన్న ఆయన జన్మదిన పండుగను జరుపుకొని, ఆయన ఆశయాలకు పునరంకితమవ్వాలని అశేష అన్నగారి అభిమానుల సమక్షంలో, సహకారంతో ఈ కార్యక్రమాన్ని అంగ రంగ వైభవంగా నిర్వహిస్తామని పలువురు అభిప్రాయపడ్డారు.

స్వతహాగా భోజన ప్రియుడైన అన్న గారి శత జయంతి కార్యక్రమంలో విదేశాలలో మొదటి సారిగా అచ్చమైన 100 రకాల తెలుగింటి సంప్రదాయ వంటకాలను సిద్ధం చేసి హాజరయ్యే అభిమానులకు, మహిళలకు, చిన్నారులకు అందించి ఈ కార్యక్రమం ఒక చిరకాల జ్ఞాపకంగా తెలుగు వారి మదిలో మిగిలిపోవాలని నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.

ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, అనిల్ ఉప్పలపాటి, యశస్వి బొద్దులూరి, సాయి బొల్లినేని, కార్తీక్ కోమటి, భాను మాగులూరి, రవి అడుసుమిల్లి, చౌదరి యలమంచిలి, యువ సిద్దార్ధ్ బోయపాటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected