Connect with us

Politics

తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్ రావు తో అట్లాంటాలో మీట్ అండ్ గ్రీట్ విజయవంతం

Published

on

అమెరికా పర్యటనలో ఉన్న భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు తెలంగాణ మాజీ (2015-2021) గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నారపరాజు రాంచందర్ రావు తో అట్లాంటాలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు.

ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (Overseas Friends of BJP USA) ఆధ్వర్యంలో జూన్ 1 గురువారం సాయంత్రం జాన్స్క్రీక్ (Johns Creek) లోని బాంబే లంగ్ (Bombay Lounge) రెస్టారెంట్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది స్థానిక భారతీయులు పాల్గొన్నారు.

నారపరాజు రాంచందర్ రావు (Naraparaju Ramchandra Rao) ని శాలువా, పుష్ప గుచ్ఛంతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాంచందర్ రావు మాట్లాడుతూ నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించారు.

అందరూ రాంచందర్ రావు తో కరచాలనం చేస్తూ ఫోటోలు దిగారు. నారపరాజు రాంచందర్ రావు అందరితో కలివిడిగా తిరుగుతూ మాటలు కలిపారు. అనంతరం టీవీ ఏషియా ఛానల్ (TV Asia Channel) తో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో వాసుదేవ్ పటేల్, రాధిక సుడా, శంకర్ రెడ్డి గండ్ర, కరుణాకర్ రెడ్డి అసిరెడ్డి, సునీల్ సావిలి, సత్యనారాయణ రెడ్డి తంగిరాల, రవి కందిమళ్ల, ప్రషీల్ రెడ్డి గూకంటి, కిషన్ తాళ్లపల్లి, నరేందర్ రెడ్డి, ఆనంద్ అక్కినేని, మహేష్ కొప్పు పాల్గొన్నారు.

ఇంకా సుధాకర్ రెడ్డి ఎల్లు, కార్తీక్ బండారు, సుధాకర్ శనక, రామాచారి నక్కర్తి, రణధీర్ థాకూర్, సురేష్ మేకల, జగన్నాథ్ బీడెం, అజయ్ ఆస్పతి, ఆనంద్ బుక్కా, వెంకట్ వి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

డిన్నర్ అనంతరం వందన సమర్పణతో ఈ మీట్ అండ్ గ్రీట్ (Meet & Greet) కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. అమెరికా పర్యటనలో ఉన్న నారపరాజు రాంచందర్ రావు మరికొన్న నగరాల కార్యక్రమాలలో కూడా పాల్గొననున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected