Connect with us

Devotional

ఆదిపరాశక్తి నివాస స్థానం మణిద్వీపము ఎక్కడ ఉంది?

Published

on

ఈ బ్రహ్మాండంలో ఏడు ఊర్థ్వలోకాలు, ఏడు అధోలోకాలు ఉన్నాయి. భూః, భువః, సువః, మహః, తపః, జనః, సత్యలోకాలు ఊర్థ్వలోకాలు. సత్యలోకాన్నే బ్రహ్మలోకమని అంటారు. ఆ పైన వైకుంఠం ఉన్నది. కుంఠము అంటే అంతరాయం. నిరంతరాయంగా సర్వత్రా ప్రవర్తింపగల విష్ణుమూర్తి నివశించే ప్రదేశం వైకుంఠం. వైకుంఠానికి పైన గోలోకం ఉన్నది. అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు నివసిస్తాడు. అతనికి అర్థభాగంలో రాధా దేవి ఉన్నది. సమస్త వేదాలు, సర్వప్రాణులూ అతని ఆజ్ఞానుసారం వర్తిస్తూ ఉంటాయి. ‘గో’ శబ్ధానికి వేదం, భూమి, ఆవు, కిరణము, ఇంద్రియము మొదలైన అర్థాలు ఎన్నో వున్నాయి. వాటికి అన్నింటికీ మూలమైనదే గోలోకము. అలాంటి గోలోకానికి పైన పరమేశ్వరి నివాస స్థానం ఉన్నది. ఆ పరమేశ్వరి జగన్మాత ఆమె ఆదిపరాశక్తి . ముగ్గురమ్మలకు మూలపుటమ్మ. ఆమె నివాసస్థానమే “మణిద్వీపము”. నాలుగ ప్రక్కలా ప్రాకాశిస్తున్న మణికాంతుల ప్రవాహల మధ్యలో ఎత్తయిన పీఠం మీద ఆ దేవత అధివసించి ఉంటుంది. ‘మణిద్వీపమ’ నే పేరు ఇందువల్లనే వచ్చింది. ఇది అన్ని లోకాలకు పైన వున్నది. దీనికి పైన మరే లోకమూ లేదు. కనుకనే దీనికి ‘సర్వలోకమ’ ని కూడా పేరు.

మణిద్వీప వర్ణన: మణి ద్వీప విస్తీర్ణం బహుయోజన విస్తీర్ణమై, బహుయోజన గంభీరమై, వున్న అమృత సముద్రం మధ్యలో ప్రకాశిస్తోంది మణిద్వీపం. గాలి తాకిడికి రేగిన తరంగ మాలికలు తీరాన్ని చేరి తెల్లని ముత్యాలవలె ప్రకాశస్తూ, తీరమంతటా చల్లదనాన్ని ప్రసరింపచేస్తూ ఉంటాయి. రాజహంసలు ఆ తీరంలో స్వేచ్ఛవిహారం చేస్తూ ఉంటాయి. తీరం పొడవునా అనేక వృక్షాలు కనిపిస్తాయి.

మొదటి ప్రాకారం లోహ ప్రాకారం: వృక్షసముదాయాన్ని దాటి కొంచెం ముందుకు సాగితే మణిద్వీపపు మొదటి ప్రాకారం కనిపిస్తుంది. అది లోహప్రాకారం. సప్తయోజన విస్తీర్ణమై ఉన్న ఈ ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి. ప్రతి ద్వారం వద్ద పాలకులుగా రక్షకభటులు ఉన్నారు. భువనేశ్వరిని సందర్శించడానికి వచ్చిన దేవతా పరివారము, వారి వాహనములు, వారి విమానములు, గుఱ్ఱాలు గాని, ఏనుగులుకాని, రథాలు కాని, లోహప్రాకారం వద్ద నిలిచిపోవలసిందే.

రెండవ ప్రాకారం కంచు ప్రాకారం: లోహప్రాకారానికి ఆవలగా రెండవ ప్రాకారం ఉన్నది. అది కాంస్య నిర్మితం. అనగా కంచు ప్రాకారాము. మొదటి దానికంటే నూఱు రెట్లు కాంతి ప్రకాశిస్తుంది రెండవ ప్రాకారం. పుష్పఫల సంభరితమైన వృక్షాలతో, ఉద్యానవన శోభతో ప్రకాశిస్తూఉంటుంది ఈ ప్రాకారం. ఈ ఉద్యానవనాలలో మంచినీటితో నిండిన సరస్సులు ఉన్నాయి. వివిధ కాలాల్లో పుష్పించి, ఫలించే పుష్పఫల సముదాయం ఉండటం వల్ల అన్ని ఋతువులలోని వాతావరణ ధర్మాలూ కలసి అక్కడ ప్రకాశిస్తూ, ఆహ్లాదకరంగా ఉన్నది. ఆ ఉద్యానవనాల చుట్టూ పూవులలోని తేనె కాలువలుగా ప్రవహిస్తోంది. నెమళ్ళు పురివిప్పి నాట్యాలు చేస్తూ మనోహరంగా ఉన్నాయి. పరమేశ్వరి సందర్శనార్థమై వచ్చిన దేవతలు, మునులు అక్కడ నిరీక్షిస్తూ ఉంటారు.

మూడవ ప్రాకారం రాగి ప్రాకారం: కంచు ప్రాకారం దాటిన తర్వాత ఏడు యోజనాల ఎత్తైన రాగిప్రాకారం ఉన్నది. ఇది మూడవది. ఇది చతురస్రంగా ఉంటుంది. ఈ ప్రాకారం లోపలి వృక్షాలు, పుష్పాలు, బంగారు రంగులో ఉంటాయి. ఋతురాజైన వసంతుడు పుష్ప సింహాసనంపై ఆసీనుడై ఇక్కడ కన్పిస్తాడు. ఆ వసంతునికి సేవకుడైన ఛత్రధారి అతనికి పూల గొడుగు పట్టి ఉండగా, మధుశ్రీ, మాధవశ్రీ, అనే కాంతలతో కలసి పుష్ప మకరంధాన్ని ఆస్వాదిస్తూ, పూలగుత్తులను ఆటచెండుగా చేసుకొని క్రీడిస్తూ, వసంతుడు కనిపిస్తాడు. గంధర్వులు ప్రియకాంతలతో అక్కడ గానం చేస్తూ ఉంటారు. ఈ ప్రాకారం వసంతలక్ష్మికి ఆలవాలమై ఉంటుంది.

నాల్గొవ ప్రాకారం సీస ప్రాకారం: సీసముతో నిర్మిచబడిన నాలుగవప్రాకారము కూడ ఏడుయోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది. గ్రీష్మ ఋతు రాజు శుచిశ్రీ , శుక్రశ్రీ అనే నాయికలతో ఇక్కడ స్వైరవిహావం చేస్తూఉంటాడు. సిద్ధులు, దివ్యులు తమ తమ పరివారాలతో దేవీ సందర్శనార్థం ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటారు.

ఐదవ ప్రాకారం ఇత్తడి ప్రాకారం: ఐదవది ఇత్తడి ప్రాకారము ఇక్కడ హరిచందన వాటికలున్నాయి. మేఘవాహనుడైన వర్ష ఋతు రాజు ఈ ప్రాకారానికి అధిపతి. ఇతనికి మేఘమే కవచం. ఇంద్రధనుస్సే విల్లు. ఉరుములే శంఖునాదాలు. నతశ్రీ మొదలుగా గల పన్నెండు మంది శక్తులతో కలసి ఈ ఋతురాజు చూడముచ్చటైన సహస్రజలధారలను కురిపిస్తూ ఉంటాడు.

ఆరవ ప్రాకారం పంచలోహమయ ప్రాకారం: పంచలోహమయ ప్రాకారం ఆరవది. ఇక్కడ సహస్రాధికంగా మందార వాటికలు ఉన్నాయి. ఇష్టలక్ష్మీ , ఊర్జలక్ష్మీ అనే భార్యలతో విలాసంగా విహరిస్తూ, సిద్ధగణాలచేత పరివేష్ఠింపబడి ఉన్న శరదృతు రాజు (నాయకుడు) ఈ ప్రాకారాన్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు.

ఏడవ ప్రాకారం వెండి ప్రాకారం: దేదీప్యమానంగా శిఖరపంక్తులతో ప్రకాశించే ఏడవ ప్రాకారం వెండితో నిర్మించబడింది. పారిజాత వృక్షసముదాయం ఇక్కడ సుగంధాలను వెదజల్లుతూ ఉంటుంది. హేమంత ఋతు రాజు (నాయకుడు) ఈ ప్రాకారానికి రాజు. ఇతనికి సహశ్రీ, సహస్యశ్రీ అనే వారు నాయికలు. దేవీవ్రత పరాయణులైన సిద్ధులచేత పరివేష్టింపబడిన ఈ రాజు దేవీ విలాస విశేషాలను తెలియజేస్తూ, విహరిస్తూ ఉంటాడు.

ఎనిమిదవ ప్రాకారం సువర్ణమయ ప్రాకారం: వెండి ప్రాకారానికి పైన ఏడు యోజనాలు ఎత్తులో నిర్మింపబడిన సువర్ణమయ ప్రాకారం ఎనిమిదవది. కడిమి పూలగుత్తులతో, లేత చిగురు టాకులతో ఆ ప్రకారపు మధ్యభాగం అంతా చూడ ముచ్చటగా ఉంటుంది. తపశ్రీ, తపస్యశ్రీ అనే నాయికలతో విహరించే శిశిర ఋతు రాజు సిద్ధగణాలతో సేవింపబడుతూ ఈ ప్రాకారానికి నాయకుడు.

తొమ్మిదవ ప్రాకారం పుష్యరాగ ప్రాకారం: తొమ్మిదవ ప్రాకారం ఎఱ్ఱని పుష్యరాగ మణులతో నిర్మింపబడి ఉంది. ఈ ప్రాకారంలోని భూభాగాలు, ఉద్యానాలు అన్నీ పుష్యరాగ మణికాంతులతో విరాజిల్లుతూ ఉంటాయి. అన్నిలోకాల అధిపతులైన దిక్పాలురు ఇక్కడ నివసిస్తూ ఉంటాయి. తూర్పున అమరావతీ స్వర్గపురం ఉన్నది. ఐరావతరమనే గజంపై వజ్రాయుధం చేతపట్టి, దేవసేనా సమూహంతో కలసి నూరు యాగాలు చేసిన ఇంద్రుడు ఇక్కడ నివసిస్తాడు. శచీదేవి దేవతా స్త్రీ పరివారంతో కలసి నందనవనంలో విహరిస్తూ ఉంటుంది.

ఆగ్నేయంలో అగ్ని వలె ప్రకాశించే వహ్ని పురం ఉన్నది. అదే అగ్నిదేవుని నివాసస్థానం. దక్షిణాన చిత్రగుప్తుడనే ప్రధానితో, ఎందరో కింకరులతో కలసి దండ ధరుడై యమధర్మరాజు నివసిస్తూ ఉంటాడు. నైరృతి దిక్కున రాక్షసగణ పరివృతుడై ఖడ్గపాణి అయిన నిరృతి నివసిస్తూ ఉంటాడు. పడమటి దిక్కున వారుణి మధువును ఆస్వాదించి, పాశహస్తుడైన వరుణుడు నివసిస్తూ ఉంటాడు. వాయువ్య దిక్కున వాయుదేవుడు, ఉత్తరాన కుబేరుడు, ఈశాన్యంలో రుద్రుడు నివసిస్తూ ఉంటారు. వాయుదేవుడు, విశాలాక్షుడు, ధ్వజహస్తుడు, మృగవాహనుడు ఉంటారు. కుబేరుడు యక్షలోకాధిపతి నవనిధులకు నాయకుడు. వృద్ధి, బుద్ధి అనే శక్తులు కుబేరును ఆధీనంలో ఉంటాయి. ఈశాన్యాన గల రుద్రలోకంలోని భవనాలన్నీ రత్ననిర్మితాలే. రుద్రుని కన్నులు మండుతున్న అగ్ని గోళాలవలె తేజోవంతమై వుంటాయి. రుద్రుడు ధనుర్భాణాలు, శూలాధ్యాయుధాలు ధరించి ఉంటాడు. అసంఖ్యాకంగా రుద్రగణాలు రుద్రుణ్ణి సేవిస్తూ ఉంటాయి. అక్కడ పరివారమంతా భయంకరమైన ముఖాలతో త్రినేత్రులుగా, శతహస్తులుగా, ఉగ్రరూపులుగా కనిపిస్తూ ఉంటారు. రుద్రుని సహచారిణి అయిన రుద్రాణీ దేవిని, భద్రకాళి మొదలైన మాతృకాశక్తులు సేవిస్తూ ఉంటారు. కపాలమాలికను ధరించి పులిచర్మం వస్త్రంగా దాల్చి, పాములనే ఆభరణాలుగా అలంకరించుకొని, ఒడలు అంతా భస్మం పూసుకొని, తమ ప్రమథ గణాలతో పరివ్యేష్ఠితుడై, ఢమరుక ధ్వానంతో దిక్కులు పిక్కటిల్లజేస్తూ ఈశాన్య దిక్కును మహేశ్వరుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ విధంగా ప్రతీ బ్రహ్మాండంలోను ఆయా దిక్కుల అధిపతులు వివిధ మణిమయ విరాజిత మండపాలతో ఒక్కొక్క లోకాన్ని తాముగా కల్పించుకొని వేరు వేరు ప్రాకారాల్లో నివసిస్తూ ఉంటారు.

పుష్యరాగమయమైన ఈ తొమ్మిదవ ప్రాకారంలో పింగళాక్షి, విశాలాక్షి, సమృద్ధి, వృద్ధి, శ్రద్ధా, స్వాహా, స్వధా, మాయా, వసుంధరా, త్రిలోక ధాత్రి, సావిత్రి, గాయత్రీ, త్రిదశేశ్వరీ, స్వరూపా, బహురూపా, స్కందమాతా, అచ్యుత ప్రియా, అమలా, విమల, అరుణి, ప్రకృతి, వికృతి, సృష్టి, స్థితి, సంహృతి, సంధ్యా, సతీ, హంసీ, మర్ధికా, వజ్రికా, దేవమాతా, భగవతీ, దేవకీ, కమలాసనా, త్రిముఖీ, సప్తముఖీ, సురాసుర విమర్ధినీ, లంబోష్టీ, ఊర్థ్వకేశీ, బహుశీర్షా, వృకోదరీ, రథరేఖా, శశిరేఖా, గగనవేగా, పవనవేగా, భువనపాలా, మదనాతురా, అనంగా, అనంగ మదనా, అనంగ మేఖలా, అనంగ కుసుమా, విశ్వరూపా, సురాదికా, క్షయంకరీ, రక్షోభ్యా, సత్యవాదినీ, శుచివ్రతా, ఉదారా, వాగీశీ మొదలైన అరవై నాలుగు మంది శక్తి స్వరూపిణులు జగన్మాతను నిరంతరం సేవిస్తూ వుంటారు. ఈ శక్తుల నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడుతూ వుంటాయి. సప్తసముద్రాలనూ ఒకే సారిగా త్రాగేసే ఉధృతితో విజృంభిస్తున్నట్లుగా ఆ అగ్నిజ్వాలలు వెలువడుతూ ఉంటాయి. నలభై తొమ్మిది మరుద్గణాలతో కూడిన వాయు మండలాన్ని నుగ్గు చేస్తున్నట్లుంటాయి. పదునాలుగు లోకాలనూ ఒక్కసారిగా మ్రింగివేసేటట్లుంటాయి. భయంకరమైన కోరలతో, నూఱు అక్షౌహిణుల వీరనారీ సమూహంతో ప్రతిశక్తీ తన స్థానంలో నివసిస్తూ ఒక్కొక్క భువనాన్ని అధివసించి ఉంటుంది. ప్రతిశక్తీ లక్షబ్రహ్మాండాలను క్షణ కాలంలో భస్మం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.

పదవ ప్రాకారం గోమేధిక మణినిర్మిత ప్రాకారం: పుష్యరాగమయ ప్రాకారనికి ఆవల గోమేధిక మణినిర్మితమైన పదవ ప్రాకారం ఉన్నది. ఇది పదియోజనాల ఎత్తులో ఉంటుంది. ఇందలి సరస్సులు, మేడలు అన్నీ గోమేధిక మణి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ ప్రాకారంలో పరమేశ్వరికి అతి సన్నిహితంగా మెలగుతూ సేవచేసే ముఫ్పయి రెండు శక్తులు ఒక్కొక్క లోకాన్ని కల్పించుకొని తమ వైభవంతో విహరిస్తూ ఉంటాయి. ఎఱ్ఱని కన్నులు, తీక్షణమైన చూపులు, భయంకరమైన ముఖాలు కలిగి పది అక్షౌహిణుల వీరనారీ సేనా సమూహం అప్రమత్తతో ఇక్కడ నిరీక్షిస్తూ ఉంటుంది. దేవి అజ్ఞాను సారం విద్యా, హ్రీ, పుష్టి, ప్రజ్ఞా, సినీవాలి, కుహు, రుద్రా, వీర్యా, ప్రభా, నందా, పోషిణీ, బుద్ధిదా, కాళరాత్రి, మహారాత్రి, భధ్రకాళి, కపర్థిని, వికృతి, దండిని, ముండిని, ఇందుఖండా, శిఖండినీ, నిశుంభ, శుంభమథిని, మహిషాసుర మర్దిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ద శరీరిణి, నారీ, నారాయణి, శూలిని, పాలిని, అంబికా, ఆహ్లాదిని అనే పేర్లు గల శక్తులు పరమేశ్వరికి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటాయి.

పదకొండవ ప్రాకారం వజ్ర ప్రాకారం: ఇది దాటితే, పదియోజనాల ఎత్తుగల వజ్రప్రాకారం కనిపిస్తూంది. ఇది పదుకొండవది. గోపుర ద్వారాలతో, గొలుసులతో, రత్నఖచితమైన మందిర సమూహాలాతో తీర్చిదిద్దిన రాజవీధులతో ఆప్రాకారం రమణీయంగా ఉంటుంది. సహస్రాధిక సంఖ్యలో పరిచారికలు ఇక్కడ ఉంటారు. ఒక్కొక్క పరిచారికకు లక్షకు పైగా దాసీజనం. వీరందరూ శృంగార సంబంధమైన సేవా కార్యక్రమాల్లో భువనేశ్వరికి పరిచర్యలు చేస్తూ ఉంటారు. వీవనలు వీచడం, పానపాత్రలు సిద్ధంచేయడం, ఛత్ర చామరాలతో సేవలు అందిస్తూ ఉండడం, దేవీ పాదాలకు లత్తుకను, పారాణిని అలంకరించడం కాటుక దిద్దడం. సింధూరపు బరిణలు సిద్ధంచేయడం వీరి కార్యక్రమాలు. దేవి పాదాలు ఒత్తుతూ, పుష్పమాలలను సవరిస్తూ, కేశపాశాన్ని అలంకరిస్తూ, ఆభరణాలనూ తొడుగుతూ, ఆమెను సేవిస్తూ ఉంటారు. అనంగ రూప, అనంగ మదన, సుందరీ, భువనవేగ, భువనపాలిక, సర్వశిశిర, అంగనవేదన, అనంగ మేఖల అనేవారు మెఱుపు తీగలవలె ఆ ప్రాంతంలో సంచరిస్తూ, దేవి కార్య తత్పరలై, ఆమె కన్నుసన్నలలో మెలగుతూ ఉంటారు.

పన్నెండవ ప్రాకారం వైడూర్య ప్రాకారం: పన్నెండవది వైడూర్య ప్రాకారం. ఇది వజ్ర ప్రాకారానికి పైన పదియోజనాల ఎత్తున నిర్మింపబడి ఉంది. మణిమయ గృహాలతో, వాపీకూప, తటాకాలతో మనోహరంగా ఉంటుంది. అష్టమాతృకలకు ఇది నివాసస్థానం. బ్రాహ్మి, మహేశ్వరీ, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి, వైష్ణవి, మహాలక్ష్మి అనే ఈ దేవతలు కోట్లాది రథాలతో, ఆకాశాన్ని తాకే పతాకాలతో, హంస, గరుడ, సింహ, వృషభాది వాహనాలతో, గజాశ్వాలతో పరమేశ్వరీ సేవలో మునిగి ఉంటారు.

ప్రథమావరణ : ప్రధానయోగిని బ్రాహ్మి. ఇతర యోగినులు.

  1. అక్షోంబా 2.రాక్షసాంబా 3. క్షపాంబా
  2. అక్షపయాంబా 5. బుక్షకర్ణాంబా
  3. క్షపణాంబా 7. పింగళాక్ష్యంబా 8. క్షమాంబా
    ద్వితీయావరణ : ప్రధానయోగి మాహేశ్వరి. ఇతర యోగినులు.
  4. లీలాంబా 3. లుత్ధాంబా 5. లూకాంబా 7. లోలసాంబా
  5. లోలాంబా 4. లుబ్బాంబా 6. లంకేశ్వరాంబా
  6. విమలాంబా
    తృతీయావరణ : ప్రధానయోగిని కౌమారి. ఇతర యోగినులు
  7. హుతాశనాంబా 2. బాడబాముఖ్యంబా
  8. హరయాంబా 4 క్రోధిన్యంబా
  9. విశాలక్ష్యంబా 6. హర్షంబా 7. క్రోధిన్యంబా
  10. సరయాంబా
    4, 7 యోగినులకు ఒకటే పేర్లు ఉన్నాయి. ఇది అచ్చు తప్పని భావించకండి.
    చతుర్థావరణ : ప్రధానయోగిని వైష్ణవి. ఇతర యోగినులు
  11. సంఖ్యాపీఠసిద్ధంబా 2. తారాంబా
  12. హృల్లేఖాంబా
  13. సరసాంబా 5. కరలాంబా 6. హృష్టాంబా
  14. దశకుందరాంబా 8. రససంగ్రాహిణ్యంబా
    పంచమావరణ : ప్రధానయోగిని వారాహి, ఇతరయోగినులు
  15. తాలజంఘాంబా 2. విద్యుజ్జిహ్వాంబా
  16. మేఘనాధాంబా 4. కాలకర్ణాంబా
  17. రక్తాక్ష్యంబా 6. కరంకాంబా
  18. ప్రచండౌఘంబా 8. బలప్రదాంబా
    షష్టావరణ : ప్రధానయోగిని మాహేంద్రి. ఇతర యోగినులు
  19. శపాంబా 2. ప్రవాయాంబా 3. పిచువక్తాంబా
  20. పిశితాజ్ఞానాంబా 5. చంపావళ్యంబా 6.శూలాసాదికాంబా 7. పిశాచాక్ష్యాంబా
  21. లోలుపాంబా
    సప్తమావరణ : ప్రధానయోగిని చాముండ. ఇతర యోగినులు.
  22. చామనసాంబా 3,8. వాసనాంబా
  23. వాయువేగాంబా 7. వికనాంబా
  24. వానరాంబా 4. వికటాస్యాంబా
  25. బృహత్క్మాలాంబా 8. విశ్వరూపిణ్యంబా
    అష్టమావరణ : ప్రధానయోగిని మహాలక్ష్మి. ఇతరయోగినులు.
  26. యమజిహ్వాంబా 3. దుర్దయాంబా
  27. బిడాలాంబా 7. పూనాంబా
  28. జయన్య్యంబా 4. యమాంతకాంబా
  29. రేవత్యంబా 8. విజయాంబా

పదమూడవ ప్రాకారం ఇంద్రనీలమణి ప్రాకారం: ఇంద్రనీలమణి ప్రాకారం పదమూడవది. పదియోజనాల పొడవైన రాజ వీధులు, సుందరమైన మందిరాలు, ఉద్యానవనాలతో ప్రకాశిస్తూ ఉంటూంది. షోడశదళ పద్మాకారంలో ఉంటుంది. కరాళి, వికరాళి, ఉమ, సరస్వతి, దుర్గ, ఉష, లక్ష్మీ,శృతి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేథా, మతి, కాంతి, మొదలైన పదహారు శక్తులు నీలమేఘశ్యామల దేహాలతో ప్రకాశిస్తూ ఖడ్గాలను ధరించి, దేవిని సేవిస్తూ ఉంటారు.

రెండవ ఆవరణ – షోడశ దళ పద్మం
ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ క్రింది పటం లో చూడవచ్చు. ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా..

  1. కామాకర్షిణీ (మనసు) (Conscious mind)
  2. బుద్హ్యాకర్షిణీ (బుద్ధి) (Intellect)
  3. అహంకారాకర్షిణీ (అహంకారం) (I or Ego)
    (పంచ తన్మాత్రలు) (The 5 Sensory Perceptions of Ears, Skin, Eyes, Tongue, Nose)
  4. శబ్దాకర్షిణీ (Hearing)
  5. స్పర్శాకర్షిణీ (Touch)
  6. రూపాకర్షిణీ (Seeing)
  7. రసాకర్షిణీ (Taste)
  8. గంధాకర్షిణీ (Smell)
  9. చిత్తాకర్షిణీ (Sub-conscious mind)
  10. ధైర్యాకర్షిణీ
  11. స్మృత్యా కర్షిణీ
  12. నామాకర్షిణీ
  13. బీజాకర్షిణీ
  14. ఆత్మాకర్షిణీ
  15. అమృతాకర్షిణీ
  16. శరీరాకర్షిణీ

పదునాల్గవ ప్రాకారం మౌక్తిక ప్రాకారం: ఆ పై వున్న పదునాల్గవ ప్రాకారం మౌక్తిక ప్రాకారం. ఇక్కడి భవనాలన్ని ముత్యాలతో నిర్మింపబడి ఉంటాయి. పది యోజనాల ఎత్తు కలిగి అష్టదళ పద్మాకారంలో ఉంటుంది ఈ ప్రాకారం. ఇక్కడ ఎనిమిది మంది మంత్రిణులు ఖడ్గపాణులై నిలచి, గూఢచారుల ద్వారా సకల బ్రహ్మాండముల వార్తలనూ సేకరించి, శ్రీమాతకు నివేదిస్తూ ఉంటారు. ఇంగిత జ్ఞానము కార్యసాధన నైపుణ్యము, వాక్చాతుర్యము కలిగి ఆ మంత్రిణులు క్షణకాలంలో దేవి ఆజ్ఞలను అమలు చేస్తూ ఉంటారు. వీరి పేర్లు అనంగకుసుమ, అనంగ కుసుమాతుర, అనంగ మదన, అనంగ మదనాతుర, భువన పాల, గగనవేగా, శశిరేఖ, గగనరేఖ. వీరంతా ఎఱ్ఱని రంగుతో ప్రకాశిస్తూ పాశాంకుశాలను చేతపట్టి విశ్వసంబంధమైన వార్తలను దేవికి చేరవేస్తూ ఉంటారు.
8 దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది. ఆ మూడవ ఆవరణలో 8 మంది ‘గుప్తతర దేవతలు’ ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు. వీరి పేర్లు వరుసగా..

  1. అనంగ కుసుమ
  2. అనంగ మేఖల
  3. అనంగ మదన
  4. అనంగ మదనాతుర
  5. అనంగ రేఖా
  6. అనంగ వేగినీ
  7. అనంగాంకుశ
  8. అనంగ మాలినీ

పదిహైనవ ప్రాకారం మరకత ప్రాకారం: ఆ పైగల ప్రాకారం మరకత నిర్మితం. ఇది షట్కోణాకారంతో పదియోజనాలు విస్తీర్ణం కలిగి ఉంటుంది. సలక సౌభాగ్యాలతో అలరారే ఈ ప్రాకారం పదిహేనవది. ఈ ప్రాకారపు తూర్పుకోణంలో గాయత్రీ సహితుడైన బ్రహ్మ దర్శనమిస్తాడు. కుండికా, అక్షసూత్రిక ధరించి, వరహస్త, దండహస్తాలతో ఉంటాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు ఇక్కడ ఆకృతి ధరించి జగన్మాతను సేవిస్తూ ఉంటాయి. వాయవ్య కోణంలో పరశువును, అక్షమాలను చేత దాల్చిన మహారుద్రుడు, రక్షో కోణంలో శంఖచక్రాలను ధరించిన సావిత్రి , అగ్ని కోణంలో ధననాయకుడైన కుబేరుడు, వరుణ కోణంలో రతీసహితుడైన మన్మథుడు ఉంటారు. ఈశాన్య కోణంలో విఘ్నకారకుడు, విజయకారకుడైన గణపతి ఉంటాడు. 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ ‘సంప్రదాయ యోగినిలు’ వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూప ఖడ్గం, వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు..

  1. సర్వ సంక్షోభిణీ
  2. సర్వ విద్రావణీ
  3. సర్వ ఆకర్షిణీ
  4. సర్వ ఆహ్లాదినీ
  5. సర్వ సమ్మోహినీ
  6. సర్వ స్తంభినీ
  7. సర్వ జ్రుమ్భిణీ
  8. సర్వ వశంకరీ
  9. సర్వ రంజనీ
    10.సర్వోన్మాదినీ
    11.సర్వార్ధ సాధినీ
  10. సర్వ సంపత్తి పూరిణీ
  11. సర్వ మంత్రమయీ
  12. సర్వ ద్వంద్వక్షయంకరీ

పదహారవది ప్రవాళ ప్రాకారం: ఇది పగడాలతో నిర్మింపబడి ఉంది. నూఱు యోజనాల ఎత్తులో ఉన్నది. సృష్టికి ఆధారమైన పంచభూతాలు, వాటిశక్తులు ఇక్కడే దేవి అనుజ్ఞ కోసం నిరీక్షిస్తూ ఉంటాయి. నవరత్న నిర్మితాలైన అమ్నాయ దేవతల గృహాలు ఎన్నో ఈ ప్రాకారంలో ఉంటాయి. ఇవి అన్నీ మహా విద్యామూర్తి రూపాలే. సప్తకోటి మహామంత్రాలకు అధిష్టాన దేవతలు ఇక్కడే నివసిస్తూ ఉంటారు. బహిర్దశారం, స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి;

  1. సర్వ సిద్ధిప్రద
  2. సర్వ సంపత్ప్రద
  3. సర్వ ప్రియంకరీ
  4. సర్వ మంగళకారిణీ
  5. సర్వ కామప్రద
  6. సర్వ దుఃఖవిమోచినీ
  7. సర్వ మృత్యుప్రశమనీ
  8. సర్వ విఘ్ననివారిణీ
  9. సర్వాంగ సుందరీ
  10. 10.సర్వ సౌభాగ్యదాయినీ

పదిహేడవ ప్రాకారం చింతామణి గృహం: సూర్యకాంత, చంద్రకాంత, విద్యుత్కాంత, మణులు – దేదీప్యమానంగా ఇక్కడ కాంతులు వెదజల్లుతూ ఉంటాయి. మణిమయ కాంతులతో ప్రకాశించే ఈ ప్రదేశం మధ్యలో శ్రీమాతా సదనం వున్నది. శ్రీమాత నివాస గృహానికి నాలుగువైపులా శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మంటపాలు ఉన్నాయి. ఒక్కొక్క మంటపం వేయి స్తంభాలతో నిర్మింపబడి ఉంది. ప్రతిమంటపమూ కాశ్మీర, మల్లికా, కుంద, కస్తూరి, మొదలైన సువాసనలతో, రత్న సోపాన సహిత పద్మ వనాలతో, సుధారస ప్రపూర్ణాలైన వాపీకూప తటాకాలతో మనోహరంగా ఉంటుంది. శృంగార మంటపంలో దేవకాంతల గానాలు వినిపిస్తూ ఉంటాయి. తమ సాధనల ద్వారా మోక్షార్హులైన వారు ముక్తి మంటపాన్ని చేరుకోగలుగుతారు. ఉపాసనల ద్వారా దేవి కృపకు పాత్రులై జ్ఞాన సముపార్డనార్హులైన భక్తులు జ్ఞాన మంటపంలో ఉంటారు. అలా జ్ఞాన మోక్షాలకు అర్హులైన సాధకులకు శ్రీమాత ఆయా మంటపాలలో దర్శనమిచ్చి, జ్ఞాన మోక్షాలను ప్రసాదిస్తూ ఉంటుంది. శృంగార మంటపం మధ్యలో ఆమె ఆసీనురాలై, దేవకాంతల గానం విని, వారిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక ఏకాంత మంటపంలో దేవి మాత్రమే నివసిస్తుంది. అక్కడ మరెవ్వరూ నిలిచే అవకాశమే లేదు.

ఇలా నాలుగు మంటపాల మధ్యలో చింతామణి గృహం ఉన్నది. ఆ గృహంలో ఒక శయ్య ఉన్నది. ఆ శయ్య (మంచ) కు పదిమెట్లున్నాయి. మూల ప్రకృతులైన శక్తి తత్త్వాలే ఆ శయ్యకు సోపానాలు. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, ఆ శయ్యకు కోళ్ళుగా ఉన్నారు. శయ్యపై ఫలకం సదాశివుడే. ఆఫలకం పై భువనేశ్వరీదేవి దర్శన మిస్తుంది. గుణత్రయాతీత అయిన పరమేశ్వరి సృష్టికి పూర్వమే తన దక్షిణ భాగం నుండి విలాసార్థం సృష్టించుకున్న రూపమే సదాశివుడు. దక్షిణార్థం సదాశివుడు. వామభాగం సదాశివ. ఈ విధమైన శివభక్తి తత్త్వం లోకకల్యాణార్థమై, చింతామణి గృహంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడి పరమేశ్వరునకు సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనే ఐదు ముఖాలు. సూర్య చంద్రాగ్నులే అతనికి త్రినేత్రాలు. అతడు కోటిసూర్య ప్రభతో, కోటి చంద్రుల చలువతో పదహారేళ్ళ నవయువకునివలె శుద్ధస్ఫటిక శరీరకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ మహాదేవుని వామాంకాన భువనేశ్వరి ఆసీన అయి ఉంటుంది. నవరత్న రాశియే ఆమెకు మొలనూలు. వైడూర్యాలు పొదగిన సువర్ణాభరణాలతో ఆమె ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె ఫాలబాగంలో అర్థ చంద్రుడు వెలుగులు వెద జల్లుతూ ఉంటాడు. ఆమె పెదవి దొండపండు కంటే ఎఱ్ఱగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆమె తన నుదుట కస్తూరి తిలకాన్ని అలంకరించుకొని ఉంటుంది. సూర్యచంద్రులే ఆమెకు చెవి క్మమలు. ఆమె కంఠం శంఖం వలె ఉన్నది. ఆమె మెడలో ముత్యాల సరాలు ఉన్నాయి. జవ్వాది, పునుగు, కస్తూరి, పచ్చ కర్పూరము, కుంకుమపువ్వు మొదలైన సువాసనలతో మంచి గంధపు పూతలతో ఆమె దివ్యదేహం అలరారుతూ ఉంటుంది. ఆమె పలువరుస దానిమ్మగింజలవలె ప్రకాశిస్తూ లోకాతిశయమైన దివ్యసౌందర్య రాశిగా భువనేశ్వరీ దేవి ప్రకాశిస్తూ ఉంటుంది.

ఆ దేవికి సహస్రదాసీ జనము, సర్వదేవతా వర్గము, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు సేవలు చేస్తున్నారు. లజ్జ, తుష్ఠి, పుష్ఠిమొదలైన పీఠశక్తులు, శంఖపద్మాది నిధులు, అమృత సముద్రంలో లీనమయ్యే సమస్తరత్న సముదాయము తన్ను పరివేష్ఠించి ఉండగా భువనేశ్వరీ మాత ఆశ్రిత కల్పవృక్షమై అనుగ్రహమూర్తిగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ చింతామణి గృహం యొక్క ప్రమాణం నాలుగవైపులా సహస్రయోజనాల పరిమితి. అది ఏఆధారమూ లేకుండానే ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటుంది. పద్మం వలె సంకోచ వ్యాకోచాలతో చూడముచ్చట్టగా వుంటుంది. దివ్యులు, నాగులు, నరులు, ఎందరో దేవీ ఉపాసకులు ఆమె పాదస న్నిధిలో ధ్యాననిమగ్నులై ఉంటారు. ఆ దేవి క్షేత్రంలో నివసించేవారు తేజోమయ రూపాలతో ప్రకాశిస్తూ ఉంటారు. దీనికి అన్ని దిక్కుల ఘృత, క్షీర, దధి, మధు రస ప్రవాహలు ఉన్నాయి. కామధేనువు, కల్పవృక్షం, చింతామణి కోరికలను తీరుస్తూ వుంటాయి. అక్కడ రోగాలు, జరామరణాలు, కామక్రోధాలు లేవు. అక్కడ వారందఱూ ముపై సంవత్సరాల యువతీ యువకులే, వయోభేదానికి సంబంధించిన వికారాలు వారికి లేవు. వారంతా సహస్ర సూర్యకాంతితో ప్రకాశిస్తూ ఉంటారు. అక్కడి వారంతా ఇహలోకసుఖాలతో పాటు బ్రహ్మానందం వరకు అన్నీ విధాలైన ఆనందాలనూ అనుభవించి, దేవిసన్నిదికి చేరుకుంటారు.

శ్రీ చక్రం – నిర్మాణము, ఆవరణలు, అధిదేవతలు.
సాధారనంగా శ్రీ చక్రం అంటే అమ్మవారి స్వరూపం అని అందరికి తెలుసు నవర్ణావ పూజ చేస్తారు అని తెలుసు, అయితే ఈ ఆవరణ నిర్మాణ పద్దతులు అందులోని దేవతలు అర్చన విధానాలు గురించి చాల మందికి అవగాహన ఉండదు. తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నా వివరంగా తెలిపే వారు తక్కువ మంది ఉన్నారు చెప్పే వాళ్ళు ఉన్నా నేర్చుకునే సమయం ఈ రోజుల్లో అందరికి లేదు..మనిషి ఆయువు కాలం కలియగంలో తక్కువ కనుక ఉన్న సమయంలోనే అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక పయనం కొనసాగించాలి అలా మనము శ్రీ చక్ర నిర్మాణము, అందులో శక్తి రూపాలు, ఆవరణలు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.

శ్రీ చక్ర నిర్మాణం, అందులోని ఆవరణలు, అధిదేవతలు గురించి తెలియటమే కాక అందులోని కేంద్ర బిందుమండల స్థానంలో తేజోమయ రూపంలో విరాజిల్లే అమ్మవారిని ఉపాసిస్తారు. ఇప్పుడు మనవంటి వారికోసం, శ్రీ చక్రం గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. “బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్త త్రయంచ ధరణీ సదన త్రయంచ శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః” గోపురము వలే కనబడు శ్రీ చక్రము చూడటానికి పైనుండి క్రిందకు క్రమముగా..

  1. బిందువు
  2. త్రికోణము
  3. వసుకోణం
  4. అంతర్దశారము
  5. బహిర్దశారం
  6. చతుర్దశారం
  7. అష్టదళపద్మం
  8. షోడశదళపద్మం, దాని చుట్టూ మూడు వృత్త రేఖలు
  9. మూడు రేఖలతో ధరణీ సదనం (భూపురం)
    బిందువు వద్ద పరదేవత అయిన శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు ఆశీనురాలై ఉంటుంది.
    నవావరణములు: శ్రీ చక్రం లో తొమ్మిది ఆవరణలు ఉంటాయి. వాటినే నవావరణలు అంటారు.
    బయటనుండి కేంద్రం వైపు పోయే వరసలో వాటి పేర్లు ఈవిధంగా వుంటాయి.
  10. ధరణీ సదనం లేదా భూపురం
  11. పదహారు దళ పద్మం
  12. నాగ(అష్ట) దళ పద్మం
  13. చతుర్దశారం
  14. బహిర్దశారం
  15. అంతర్దశారము
  16. వసుకోణం
  17. త్రికోణము
  18. బిందువు
    మొదటి ఆవరణం – ధరణీ సదనం (భూపురం)
    శ్రీ చక్రానికి వెలుపల నాలుగు వైపులా గోడలాగా ఉండే దాన్ని భూపురం అంటారు. ఈ ప్రధమ ఆవరణలో అణిమాది దేవతలు 28 మంది ఉంటారు. వీరందరూ మందార పువ్వు రంగు గల దేహచ్చాయ తో ఉంటారు. ఒక్కొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో చింతామణి, కపాలం, త్రిశూలం, అంజనం లేదా కాటుక ఆయుధాలుగా ధరించి వుంటారు. ఆ 28 దేవతల పేర్లు క్రింద ఇవ్వబడ్డాయి:
    అష్ట సిద్దులు:
  19. అణిమా
  20. మహిమా
  21. గరిమ
  22. లఘిమా
  23. ప్రాప్తి
  24. ప్రాకామ్య
  25. ఈశిత్వ
  26. వశిత్వ
  27. ఇచ్ఛా
  28. సర్వకామ
    సప్త మాతృకలు:
  29. బ్రాహ్మి
  30. మాహేశ్వరి
  31. కౌమారి
  32. వైష్ణవి,
  33. వారాహి
  34. మహేన్ద్రి
  35. చాముండా
  36. మహాలక్ష్మి
  37. సర్వసంక్షోభిని
  38. సర్వ విద్రావిణీ
  39. సర్వాకర్షణీ
  40. సర్వవశంకరీ
  41. సర్వోన్మాదినీ
  42. సర్వ మహంకుశా
  43. సర్వ ఖేచరీ
  44. సర్వ బీజా
  45. సర్వ యోని
  46. సర్వ త్రిఖండా
    రెండవ ఆవరణ – షోడశ దళ పద్మం
    ఇది 16 దళాల పద్మాకారం లో ఉంటుంది. ఈ ఆవరణలో 16 మంది గుప్త దేవతలు పైన చూపిన సంఖ్యల క్రమంలో ఉంటారు. ఒకొక్కరికి నాలుగు చేతులు ఉంటాయి. మూడు నేత్రాలు ఉంటాయి. చంద్ర వంక ను ధరించి ఉంటారు. ధనుస్సు , బాణం, డాలు, ఖడ్గం ఆయుధాలుగా దరించి ఉంటారు. వారి పేర్లు వరుసగా..
  47. కామాకర్షిణీ
  48. బుద్హ్యాకర్షిణీ
  49. అహంకారాకర్షిణీ (పంచ తన్మాత్రలు)
  50. శబ్దాకర్షిణీ
  51. స్పర్శాకర్షిణీ
  52. రూపాకర్షిణీ
  53. రసాకర్షిణీ
  54. గంధాకర్షిణీ
  55. చిత్తాకర్షిణీ
  56. ధైర్యాకర్షిణీ
  57. స్మృత్యా కర్షిణీ
  58. నామాకర్షిణీ
  59. బీజాకర్షిణీ
  60. ఆత్మాకర్షిణీ
  61. అమృతాకర్షిణీ
  62. శరీరాకర్షిణీ
    తృతీయ ఆవరణం – అష్ట దళ పద్మం
    శ్రీ చక్రంలోని మూడవ ఆవరణం 8 దళాల పద్మాకారంలో ఇక్కడ చూపిన విధంగా ఉంటుంది.
    ఆ మూడవ ఆవరణలో 8 మంది ‘గుప్తతర దేవతలు’ ఉంటారు. మందార పువ్వు రంగు దేహకాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. చెరుకు విల్లు, పుష్ప శరం, పుష్ప గుచ్చం, ఉత్పలం ధరించి ఉంటారు. వీరి పేర్లు వరుసగా..
  63. అనంగ కుసుమ
  64. అనంగ మేఖల
  65. అనంగ మదన
  66. అనంగ మదనాతుర
  67. అనంగ రేఖా
  68. అనంగ వేగినీ
  69. అనంగాంకుశ
  70. అనంగ మాలినీ
    నాలుగవ ఆవరణ – మన్వస్రం
    శ్రీ చక్రం లోని నాలుగవ ఆవరణ ఇక్కడ 14 కోణాలు కలిగిన ఆకారంతో ఉంటుంది. ఇక్కడ ‘సంప్రదాయ యోగినిలు’ 14 మంది పటం లో సూచించిన సంఖ్యల క్రమం లో ఉంటారు.
    వీరు కాలానల శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వహ్ని చాపం, వహ్ని బాణం, వహ్ని రూప ఖడ్గం, వహ్ని రూప చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు..
  71. సర్వ సంక్షోభిణీ
  72. సర్వ విద్రావణీ
  73. సర్వ ఆకర్షిణీ
  74. సర్వ ఆహ్లాదినీ
  75. సర్వ సమ్మోహినీ
  76. సర్వ స్తంభినీ
  77. సర్వ జ్రుమ్భిణీ
  78. సర్వ వశంకరీ
  79. సర్వ రంజనీ
    10.సర్వోన్మాదినీ
    11.సర్వార్ధ సాధినీ
  80. సర్వ సంపత్తి పూరిణీ
  81. సర్వ మంత్రమయీ
  82. సర్వ ద్వంద్వక్షయంకరీ
    ఐదవ ఆవరణ – బహిర్దశారం
    ఈ ఆవరణ 10 కోణాలు కలిగిన ఆకారంలో ఉంటుంది: ఈ ఆవరణలో పది ‘శక్తులు’ పటంలో చూపిన వరుస క్రమంలో ఉంటారు. స్ఫటిక మణి కాంతి కలిగిన శరీర కాంతి తో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా పరశువు, పాశము, గద, ఘంటామణి ధరించి ఉంటారు. ఈ పదిమంది శక్తుల పేర్లు ఇవి..
  83. సర్వ సిద్ధిప్రద
  84. సర్వ సంపత్ప్రద
  85. సర్వ ప్రియంకరీ
  86. సర్వ మంగళకారిణీ
  87. సర్వ కామప్రద
  88. సర్వ దుఃఖవిమోచినీ
  89. సర్వ మృత్యుప్రశమనీ
  90. సర్వ విఘ్ననివారిణీ
  91. సర్వాంగ సుందరీ
    10.సర్వ సౌభాగ్యదాయినీ
    ఆరవ ఆవరణ – అంతర్దశారం
    శ్రీ చక్రం ఆరవ ఆవరణ 10 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. ఈ ఆవరణలో 10 మంది ‘నిగర్భ యోగినులు’ ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. నాలుగు చేతులలోనూ వజ్రము, శక్తి, తామరం, చక్రం ధరించి ఉంటారు. వీరి పేర్లు..
  92. సర్వజ్ఞా
  93. సర్వ శక్తి
  94. సర్వ ఐశ్వర్య ప్రద
  95. సర్వ జ్ఞానమయీ
  96. సర్వ వ్యాధి వినాశిని
  97. సర్వాధార స్వరూపా
  98. సర్వపాపహరా
  99. సర్వానందమయీ
  100. సర్వ రక్షాస్వరూపిణీ
  101. సర్వేప్సితార్ధప్రదా
    సప్తమావరణం – వసుకోణం
    శ్రీ చక్రం లో ఏడవ ఆవరణ 8 కోణాలు కలిగిన ఆకారం లో ఉంటుంది. ఈ ఆవరణలో ఎనిమిదిమంది ‘వాగ్దేవతలు’ ఉంటారు. వీరు రక్తాశోక కాంతి గల శరీర కాంతిలో ఉంటారు. ఒకొక్కరికీ నాలుగు చేతులు ఉంటాయి. వాటిలో బాణం, విల్లు, వీణ, పుస్తకం ధరించి ఉంటారు. వీరి పేర్లు..
  102. వశినీ
  103. కామేశ్వరీ
  104. మోదినీ
  105. విమలా
  106. అరుణా
  107. జయినీ
  108. సర్వేశ్వరీ
  109. కౌళినీ
    ఎనిమిదవ ఆవరణ: త్రికోణం
    శ్రీ చక్రం లో ఎనిమిదవ ఆవరణ మూడు కోణాలు కలిగిన త్రిభుజాకారం లో ఉంటుంది. ఈ ఆవరణలో ముగ్గురు ‘అతి రహస్య శక్తులు’ పటం లో చూపించిన వరుస క్రమంలో ఉంటారు. వీరికి ఒకొక్కరికీ ఎనిమిది చేతులు ఉంటాయి. వాటిలో వరుసగా, బాణం, చాపం, పాన పాత్ర, మాతులుంగ , ఖడ్గం, డాలు, నాగపాశం, ఘంటాయుధం ధరించి వుంటారు. వీరి పేర్లు;
    కామేశ్వరీ
    భగమాలినీ
    వజ్రేశ్వరీ
    నవమ ఆవరణం – బిందు మండలం
    ఇది శ్రీ చక్ర కేంద్రం వద్ద బిందు పరిమాణంలో ఉంటుంది. ఈ ఆవరణలో పదహారు నిత్యా దేవతలు ఉంటారు. వీరందరూ లలితాదేవి తో సమానమైన తేజస్సు, పరాక్రమం తో ఉంటారు. వీళ్ళందరూ కాల రూపులు, విశ్వమంతా వ్యాపించి వుంటారు.
    నిత్యాదేవతల పేర్లు..
  110. కామేశ్వరీ
  111. భగమాలినీ
  112. నిత్యక్లిన్నా
  113. భేరుండా
  114. వహ్నివాసినీ
  115. మహావజ్రేశ్వరీ
  116. శివదూతీ
  117. త్వరితా
  118. కులసుందరీ
  119. నిత్యా
  120. నీలపతాకా
  121. విజయా
  122. సర్వమంగాళా
  123. జ్వాలామాలినీ
  124. చిత్రా
  125. మహా నిత్యా
    బిందు మండలం చేరితే అమ్మవారి సన్నిధి చేరినట్లే. శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలలోనూ ఒక్కొక్క ఆవరణలో ఎనిమిది దిక్కులయందు ఎనిమిది మంది చొప్పున 9×8×8=576 మంది యోగినులు ఉంటారు. వారందరికీ ఒక్కొక్కరికీ కోటిమంది సేవకులుంటారు. ఈ రకంగా 576 కోట్లమంది యోగినలతో సేవించబడతూ ఉంటుంది ఆ పరమేశ్వరి. మహాచతుషష్టి కోటియోగినీగణ సేవితా అంటే 576 కోట్ల యోగినులు అనబడే శక్తిగణముచే సేవించబడునది లలితాదేవి అని అర్ధం.

మణిద్వీప వర్ణన చదివినా విన్నా ఎంతో పుణ్యఫలం లభించి, సర్వశుభాలు కలుగుతాయని ఫలశ్రుతిని కూడా అనుగ్రహించాడు వ్యాసమహర్షి.

– సురేష్ కరోతు

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected