Connect with us

News

ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆస్తిపన్ను ఎగ్గొట్టిన వైఎస్‌ జగన్‌ రెడ్డి

Published

on

జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే తాడేపల్లిలో ప్యాలెస్ లాంటి ఇల్లు కట్టించుకున్న సంగతి తెలిసిందే. కానీ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఆస్తి పన్ను ఎగ్గొట్టేసారు సారు. అంతో ఇంతో కూడా కాదు, దాదాపు 16 లక్షల రూపాయలకి పైనే. గుంటూరు జిల్లా తాడేపల్లి మునిసిపాలిటీ వెబ్సైటులోనే ఈవిషయాన్ని ఉంచారు. ప్రజలపై ఆస్తిపన్ను బాదుడుకు సిద్ధమైన జగన్‌ తన సొంత నివాసానికి మాత్రం పన్ను కట్టడం లేదు. పవర్లో ఉన్నాం, మమ్మల్ని అడిగేదెవరులే అనుకుంటున్నారేమో. సామాన్యుల్లో ఎవరైనా కట్టకపోతే ఏం జరుగుతుంది? పెనాల్టీలు వేసి మరీ వసూలు చేస్తారు. తాగునీరు, విద్యుత్‌, ఇతర సదుపాయాలు ఆపేస్తారు. ఇంకా నోటీసులు అంటిస్తారు. పాలకులు రోల్ మోడల్ గా ఉండాలిగానీ, సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనో!

error: NRI2NRI.COM copyright content is protected