Connect with us

Cultural

సీతా రామం సినిమా బృందంతో కోలాహలంగా GWTCS దీపావళి వేడుకలు

Published

on

సాయి సుధ పాలడుగు అధ్యక్షతన వాషింగ్టన్ డీసీలో గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) ఏర్పాటు చేసిన దీపావళి కార్యక్రమంలో ప్రముఖ సినీ నటులు సీతా రామం బృందం దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, స్వప్న దత్, హను రాఘవపూడి (Hanu Raghavapudi) మరియు ఇతర సంగీత కళాకారులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జీడబ్ల్యూటీసీఎస్ (GWTCS) అధ్యక్షురాలు సాయి సుధ పాలడుగు మాట్లాడుతూ.. భాష నాగరికతను నేర్పిస్తుంది. తెలుగుభాష తియ్యందనాన్ని, తెలుగుజాతి గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలన్నారు. భాషను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

అమెరికా తెలుగు సంఘాల్లో జీడబ్ల్యూటీసీఎస్ కు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాలో ఉన్న అన్ని సంస్థల కంటే ఈ సంస్థకి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. తెలుగు భాషను, సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటుతూ, గత 47 సంవత్సరాలుగా ప్రతి తరానికి దగ్గర చేస్తూ ముందుకు సాగుతుందన్నారు.

ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) మాట్లాడుతూ.. ఇంత మంది తెలుగువారిని ఒకచోట కలుసుకోవటం సంతోషంగా ఉంది. నా సినిమాలను అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు బాగా ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు. కాలం మారుతున్నా, నాగరికత మారుతున్నా, సంస్కృతి మారుతున్నా.. అమెరికాలో ఉన్న తెలుగువారు మాత్రం తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను, పండుగలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు.

సినీ హీరోయిన్ మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) మాట్లాడుతూ.. సీతారామం చిత్రాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఒక మహిళగా సాయిసుధా ఈ సంస్థను సమర్థంగా నడిపించిందని కొనియాడారు. నిర్మాత స్వప్న దత్ (Swapna Dutt) మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమ అనేకమంది నటులకు అవకాశాలు కల్పించింది అన్నారు.

ఈ కార్యక్రమంలో సతీష్ వేమన, నరేన్ కొడాలి, కృష్ణ లాం, మన్నవ సుబ్బారావు, సత్య సూరపనేని, వెంకట్రావు మూల్పూరి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు చంద్ర మాలవత్తు, రవి అడుసుమిల్లి, విజయ్ అట్లూరి, సుష్మా అమరుత్తలూరి, రాజేష్ కాసరనేని, భాను మాగులూరి, ఉమాకాంత్ రఘుపతి, ప్రవీణ్ కొండగ, శ్రీవివాస్ గంగ, యష్ బద్దులూరి, శ్రీ విద్యా సోమ, సురేష్ పాలడుగు, మన్నె సుశాంత్, ఫణి తాళ్లూరి, మన్నె సత్యనారాయణ, తానా 2023 కాన్ఫరెన్స్ ఛైర్మన్ రవి పొట్లూరి, తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో తానా (TANA), ఆటా (ATA) తో సహా పలు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. GWTCS ప్రస్థానంలో మరో మైలు రాయిగా నిలిచిపోతుంది. ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరయ్యారు. సమాజసేవలో ముందున్న పలువురికి దుల్కర్ సల్మాన్ జ్ఞాపికలు అందజేశారు. చిన్నారుల నృత్యాలు, మహిళల ఫ్యాషన్ షో అందరినీ అలరించాయి.

విజయవంతంగా నిర్వహించిన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) దీపావళి వేడుకల అనంతరం తెలుగువారు అమితంగా ఇష్టపడే లడ్లు సుమారు వెయ్యి వరకు పంచడం విశేషం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected