Connect with us

Cultural

Atlanta, Georgia: సంస్కృతి, వినోదం సమ్మేళనంగా అట్లాంటాలో ఆటా డే సందడి

Published

on

Cumming, Atlanta, Georgia: అమెరికాలో తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చే లక్ష్యంతో ఆటా (American Telugu Association – ATA) 19వ మహాసభలను జులై 31 నుండి ఆగష్టు 2 వరకు మేరీల్యాండ్ రాష్ట్రంలోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్ లో ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇందులో భాగంగా అట్లాంటాలో నిర్వహించిన “ఆటా డే” కార్యక్రమం అత్యంత ఘనవిజయాన్ని సాధించింది. ఈ కన్వెన్షన్ కిక్ ఆఫ్ మరియు ఫండ్రైజర్ కార్యక్రమం మే 3వ తేదీ ఆదివారం సాయంత్రం అట్లాంటా సమీపంలోని కమ్మింగ్‌ పట్టణంలోని బంజారా బ్యాంక్వెట్స్‌ (Banjara Banquets) లో నిర్వహించారు.

ఆటా అట్లాంటా (ATA Atlanta Chapter) నాయకులు కరుణాకర్ అసిరెడ్డి, కిరణ్ రెడ్డి పాశం, అనిల్ బొద్దిరెడ్డి, శ్రీధర్ తిరుపతి, శ్రీనివాస్ శ్రీరామ తదితరుల సారధ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమం సాంస్కృతిక ఉత్సాహంతో నిండిపోయింది.

చిన్నారుల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొన్న నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, వినోద కార్యక్రమాలు (Cultural Programs) ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రత్యేకంగా యువత ప్రదర్శించిన డాన్స్ ప్రోగ్రామ్స్, సంప్రదాయ మరియు ఆధునిక కళల సమ్మేళనం అందరికీ ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ఆటా (ATA) నాయకత్వం సంస్థ లక్ష్యాలను, భవిష్యత్ కార్యాచరణను వివరించింది. “Passion for Our Culture, Compassion for Our People” అనే నినాదాన్ని ప్రతిబింబిస్తూ, సమాజ సేవలో ఆటా చేస్తున్న కార్యక్రమాలను నాయకులు వివరించారు.

ఈ వేడుకకు వందలాది మంది తెలుగు కుటుంబాలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. స్పాన్సర్లను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఇతర తెలుగు సంస్థల (Telugu Associations) నాయకులు సైతం పెద్ద ఎత్తున పాల్గొనడం ఆటా ఉన్నతికి నిదర్శనం.

ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa) సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఛైర్స్, కోచైర్స్, వాలంటీర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆటా అట్లాంటా చాప్టర్ (ATA Atlanta Chapter) కోర్ టీం ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ వేడుకలో పాల్గొన్న వారందరికీ రుచికరమైన విందు మరియు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాక్‌టెయిల్స్ కార్యక్రమానికి మరింత ఆకర్షణగా నిలిచాయి. ఈవెంట్ ఫుడ్ స్పాన్సర్‌గా బిర్యానీ పాట్ (Biryani Pot) అందించిన వంటకాలు, ఫోటోగ్రఫీ స్పాన్సర్‌గా నిరు క్లిక్స్ (Niru Clicks) అందించిన సేవలు విశేషంగా మెప్పించాయి.

ఈ సందర్భంగా జులై 31 నుండి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్‌ (Baltimore, Maryland) లో జరగనున్న రాబోయే ATA 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్ గురించి నిర్వాహకులు వివరించి, అందరూ భారీగా పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు.

అట్లాంటా (Atlanta, Georgia) లో ఆటా డే కార్యక్రమం మొత్తం స్నేహపూర్వక వాతావరణంలో సాగి, తెలుగు వారిలో ఐక్యతను మరింత బలోపేతం చేసింది. కుటుంబ సమేతంగా హాజరైన సభ్యులు ఈ వేడుకను ఒక పండుగలా ఆస్వాదించారు.

మొత్తానికి “ATA Day – అట్లాంటా” కార్యక్రమం తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తూ, సమాజ సేవకు అంకితమైన ఒక అద్భుత వేదికగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని పాల్గొన్న వారు ఆకాంక్షించారు.

సంస్కృతి, వినోదం సమ్మేళనంగా అట్లాంటాలో సందడిగా నిర్వహించిన ఆటా డే కార్యక్రమానికి సంబంధించి మరిన్ని ఫోటోల కోసం www.NRI2NRI.com/ATA Day 2026 in Atlanta Georgia ని సందర్శించండి.

error: NRI2NRI.COM copyright content is protected