Connect with us

Politics

NRI TDP USA కోఆర్డినేటర్ కోమటి జయరాం కి మినియాపోలిస్ లో అపూర్వ స్వాగతం

Published

on

ఎన్నారై టీడీపీ మిన్నెసోటా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నందమూరి తారక రామారావు (Nandamuri Taraka Rama Rao) శతజయంతి ఉత్సవాలలో పాల్గొనటానికి విచ్చేసిన NRI TDP USA కోఆర్డినేటర్ కోమటి జయరాం కి మినియాపోలిస్ లో అపూర్వ స్వాగతం లభించింది.

నిన్న శుక్రవారం రాత్రి 11.30 గంటలకు మినియాపోలిస్ చేరుకున్న కోమటి జయరాం కి ఎన్నారై టీడీపీ మిన్నెసోటా (NRI TDP Minnesota) శ్రేణులు సాయి బొల్లినేని, వెంకట్ జువ్వ, మరికొందరు ఘన స్వాగతం పలికారు. మహిళలు సైతం తరలి రావడం చూస్తుంటే అన్నిచోట్లా ఎన్టీఆర్ మరియు టీడీపీ మ్యానియా కనిపించింది.

ఈ రోజు జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో కోమటి జయరాం తోపాటు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ శాసన సభ్యులు బోండా ఉమా మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు పాల్గొననున్నారు. ఈరోజు గార్డెన్ రూమ్ ఆఫ్ ఎడెన్ ప్రయిరీ లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్న ఈ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

error: NRI2NRI.COM copyright content is protected