Connect with us

Health

గౌతమ్‌ అమర్నేని దాతృత్వం, తానా ఫౌండేషన్‌ మెగా వైద్య శిబిరం @ Hyderabad Slums

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం TANA ఆధ్వర్యంలో హైదరాబాద్‌ (Hyderabad) లో ఆగస్టు 4వ తేదీ ఆదివారం నాడు తానా ఫౌండేషన్ (TANA Foundation) మరియు స్వేచ్ఛ (Swecha) సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో 650 మందికి పైగా ఉచితంగా వైద్యసేవలందించారు.

ప్రతి నెలా మొదటి ఆదివారం ఉచిత మెడికల్ క్యాంప్ రెగ్యులర్ గా నిర్వహిస్తున్నారు. తానా ఫౌండేషన్ (TANA Foundation) క్యాంప్ నిర్వహణలో సహకారం అందించడం ఇది 7వ సారి. ఈ వైద్య శిబిరానికి గౌతమ్‌ అమర్నేని (Gautham Amarneni) కుటుంబం స్పాన్సర్లుగా వ్యవహరించారు.

తానా ఫౌండేషన్ తరపున సంస్థ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి (Sasikanth Vallepalli) క్యాంప్ నిర్వహణను పర్యవేక్షించారు. ఈ క్యాంప్‌ కు గచ్చిబౌలి (Gachibowli), శేరిలింగంపల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల్లోని స్లమ్స్‌ (Slums) నుంచి దాదాపు 650 మంది హాజరయ్యారు.

ఈ మెడికల్‌ క్యాంప్‌ (Free Mega Medical Camp) కోసం 26 మంది వైద్యుల బృందం పని చేస్తుంది. వీరంతా రొటేషన్‌ పద్ధతిలో హాజరవుతుంటారని తెలిపారు. ఆర్ధోపెడిక్‌, డయాబెటీక్‌, గైనకాలజీ, పీడీయాట్రిషన్‌ ఇంకా ఇతర విభాగాలకు సంబంధించిన డాక్టర్లు కన్సల్టెన్సీ సేవలు అందించారు.

పేషెంట్లు అందరికీ నెలకు సరిపడా మందులను (Free Medicine) ఉచితంగా అందించారు. విజయవంతంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన అందరినీ తానా అధ్యక్షులు నిరంజన్‌ శృంగవరపు (Niranjan Srungavarapu) మరియు కోఆర్డినేటర్ శ్రీనివాస్ యెండూరి (Srinivas Yenduri) అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected