Connect with us

News

లీడర్షిప్ లో లేను మగడా అంటే, తూచ్ మీటింగ్స్ కి రాలేదంటూ భరత్ మద్దినేని పై వేటు

Published

on

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America – TANA) తానా ఎన్నికలు పలు మలుపులు తిరుగుతున్నాయి. విషయంలోకి వెళితే అంజయ్య చౌదరి లావు అధ్యక్షునిగా, భరత్ మద్దినేని (Bharath Maddineni) జాయింట్ ట్రెజరర్ గా 2021-23 మొత్తం లీడర్షిప్ కాల పరిమితి కన్వెన్షన్ చివరి రోజైన జులై 9, 2023 తో ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే.

అనంతరం నిరంజన్ శృంగవరపు అధ్యక్షునిగా, సునీల్ పాంత్ర జాయింట్ ట్రెజరర్ గా 2023-25 కాలానికి సెలక్షన్ పద్ధతిలో నూతన కార్యవర్గం కూడా ఏర్పాటు అయ్యింది. తనని ఏ పదవికి కూడా సెలెక్ట్ చేయకపోవడంతో భరత్ మద్దినేని (Bharath Maddineni) తన మాడిపోయిన మసాలా దోశలు తను తింటుండగా దాదాపు మూడు నెలల అనంతరం కోర్టు ఈ సెలెక్టెడ్ కార్యవర్గ ఎంపికను కొట్టేసి ఎన్నికలు నిర్వహించమని ఆదేశించింది.

Bharath Maddineni

దీంతో భరత్ మద్దినేని ట్రెజరర్ పదవికి నామినేషన్ (Nomination) వేశారు. ఆ నామినేషన్ ని ఎలక్షన్ కమిటీ (Election Committee) కూడా ఆమోదించింది. ఎలక్షన్ ప్రచారం కూడా సాఫీగా నిర్వహించుకుంటున్నారు. ఇది ఇష్టం లేని కొందరు అదృశ్య శక్తులు రంగంలోకి దిగారు. భరత్ మద్దినేని మూడు లీడర్షిప్ మీటింగ్స్ కి రాలేదంటూ సిల్లీ రీజన్ చూపి 4 సంవత్సరాలపాటు తానా ఎలక్షన్స్ లో పాల్గొనకుండా అనర్హత వేటు వేశారు.

అరే బాబు నా జాయింట్ ట్రెజరర్ పదవి జులై 9, 2023 తో ముగిసింది. నా తర్వాత అదే పదవికి మీరే సునీల్ పాంత్ర ని నియమించుకున్నారు. అనంతరం కోర్టు కూడా మీ బోర్డు సభ్యులను ఎలక్షన్ నిర్వహణకి మాత్రమే పునరుద్ధరించింది, మా ఎగ్జిక్యూటివ్ కమిటీని కాదు అంటూ… నేను లీడర్షిప్ లో లేను కదరా మగడా అంటే, మీరేంటి తూచ్! మీటింగ్స్ కి హాజరవ్వలేదు అంటూ అనర్హత వేటు అంటారు అని భరత్ మద్దినేని వాపోయారు.

ఇదంతా చూస్తుంటే వెయ్యని అమరావతి రింగు రోడ్ లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు (Nara Chandrababu Naidu) పై కేసు పెట్టినట్టు, లీడర్షిప్ లో లేని నేను లీడర్షిప్ మీటింగ్స్ కి రాలేదంటూ అనర్హత వేటు వేయడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఒక వేళ మీరు నన్ను అదే పూర్వపు జాయింట్ ట్రెజరర్ పదవికి నియమించినట్లైతే నాకు తెలియపరచాలి కదా, కనీస సమాచారం ఇవ్వకుండా నేను మీటింగ్స్ కి హాజరవ్వడం లేదనడం ఎంత వరకు సబబు అని నిలదీశారు. అయినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో న్యాయస్థానాన్ని (Court) ఆశ్రయించే పనిలో తానా బోర్డు సభ్యులకి లీగల్ నోటీసులు పంపారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected