Connect with us

News

ఆటా వేడుకలకు ఘనమైన ముగింపు @ Ravindra Bharathi, Hyderabad

Published

on

అమెరికా తెలుగు సంఘం (ATA) ‘ఆటా’ ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత 20 రోజులుగా నిర్వహిస్తున్న ఆటా వేడుకల కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. నిన్న డిసెంబర్ 30న హైదరాబాద్ (Hyderabad) లోని రవీంద్ర భారతి (Ravindra Bharathi) ఆడిటోరియంలో చివరి కార్యక్రమం నిర్వహించారు.

ATA Vedukalu 2023 Grand Finale అంటూ నిర్వహించిన ఈ ముగింపు కార్యక్రమానికి ఆటా నాయకులతోపాటు పలువురు రాజకీయ మరియు సినీ రంగానికి చెందిన హేమాహేమీలు హాజరయ్యారు. దీంతో ఆటా వేడుకలకు (ATA Vedukalu) ఘనమైన ముగింపు పలికినట్లైంది.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కన్వెన్షన్ కి ముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్య, వైద్యం, వ్యాపారం రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు (Service Activities) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2024 జూన్ 7, 8, 9 తేదీలలో అమెరికాలోని అట్లాంటా నగరంలో ఆటా కన్వెన్షన్ (ATA 18th Conference & Youth Convention) నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ లో ఈ గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి విచ్చేసిన ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని (Madhu Bommineni) మరియు ఆటా ఉపాధ్యక్షులు జయంత్ చల్లా (Jayanth Challa) సారధ్యంలోని ఆటా నాయకులకు డప్పులు, నృత్యాలతో స్వాగతం పలికారు. ఈ నృత్యాలకు ఆటా నాయకులు సైతం కాలు కదిపారు.

ఆహ్వానితులందరికీ స్వాగతం పలికి, జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అలాగే ఆటా (American Telugu Association) చేస్తున్న సేవలకు సంబంధించి వీడియో ప్రదర్శించారు. స్పాన్సర్లను ఘనంగా సత్కరించారు.

ఆటా కన్వెన్షన్ (ATA Convention) లోగో మరియు ప్రోమో ప్రదర్శించి అట్లాంటా లో నిర్వహించనున్న కన్వెన్షన్ కి 18 వ ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం మరియు ఆటా మాజీ అధ్యక్షులు కరుణాకర్ అసిరెడ్డి ఆహ్వానించారు. భారత ప్రభుత్వ మంత్రి కిషన్ రెడ్డి (Gangapuram Kishan Reddy), తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Thanneeru Harish Rao), ఎమ్మెల్యేలు (MLA), ఎమ్మెల్సీలు (MLC) పలువురు ఈ గ్రాండ్ ఫినాలే కి హాజరయ్యారు.

వీరందరూ సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. అలాగే ఆటా నాయకులను అభినందించారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ‘ఆటా’ సంస్థ తెలుగు సమాజానికి, సంస్కృతికి అపూరూప సేవలు అందిస్తోంది. విదేశాల్లో స్థిరపడిన మన తెలుగు ప్రజలు తమ మూలాలను మర్చిపోకుండా జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు అంటూ పలువురు కొనియాడారు.

‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని’’ అని రాయప్రోలు సుబ్బారావు ఇచ్చిన పిలుపును మన తెలుగు ప్రజలు అందిపుచ్చుకున్నారు. అమెరికాలోని పదిలక్షల మంది తెలుగువారు తమ సంప్రదాయాలను, కళలు మర్చిపోకుండా కొనసాగిస్తున్నారు.

అంతేకాదు వేల మైళ్ల దూరంలో ఉన్న సాటి తెలుగు ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. 33 ఏళ్లుగా ఆటా సంస్థ తెలుగు సంస్కృతికి, సాహిత్యానికి సేవ చేయడం ఒక ఎత్తు, ప్రజా సంక్షేమానికి పాటుపడడం మరో ఎత్తు అంటూ ఆటా నాయకులను అభినందించారు.

మారుమూల అచ్చంపేట (Telangana) నల్లమల అడవుల్లోని చెంచు ప్రజలకు దుప్పట్లు, దుస్తులు అందించి పెద్ద మనసు చాటుకున్నఅందరికీ అభినందలు. ఎక్కడి అమెరికా? ఎక్కడి అచ్చంపేట? ఈ బంధాన్ని కలిపింది మన తెలుగు భాష, సంస్కృతి అని అన్నారు.

తెలుగు సినీ నటులు డా. రాజేంద్రప్రసాద్ (Gadde Rajendra Prasad) కి ఆటా జీవన సాఫల్య పురస్కారం అందజేశారు. 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఆయన అందుకోని విజయంలేదు. ఆబాల గోపాలన్ని నవ్వించిన మన ‘మాయలోడి’ కి ఈ పురస్కారం ‘ముత్యమంత ముద్దు’ వంటిది.

హాస్యం మన జీవితంలో బరువును తగ్గిస్తుంది. ఆరోగ్యకర హాస్యం ఆలోచింపజేస్తుంది. రాజేంద్ర ప్రసాద్ హాస్యం ప్రత్యేకమైనది. రేలంగి, రమణారెడ్డి, రాజబాబు ఎవరికివాళ్లే గొప్పవాళ్లు. కానీ వాళ్లు హీరోలు కాదు. రాజేంద్ర ప్రసాద్ హీరో. ఒక పాత్రలో హీరో షేడ్‌ను, కమెడిన్ షేడ్‌ను అద్భుతంగా పండిచడం ఆయనకే చెల్లింది.

రాజేంద్ర ప్రసాద్ గారు సినిమాల్లో వినోదంతోపాటు మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ అధ్యక్షుడిగా ఆయన తనతోటి ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించారు. ఆయనను ఈ అవార్డుతో సత్కరించడం సంతోషంగా ఉంది. ఆయనకు, ఆటా నిర్వాహకులకు నా హృదయపూర్వక అభినందనలు అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు మధు బొమ్మినేని, ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఆటా వేడుకల చైర్మన్ వేణు సంకినేని, ఆటా సెక్రటరీ రామకృష్ణారెడ్డి ఆల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18 వ ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ కిరణ్ పాశం, 18 వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రెటరీ రవీందర్ గూడూరు, మీడియా కోఆర్డినేటర్ ఈశ్వర్ బండ, పాస్ట్ ప్రెసిడెంట్స్ కరుణాకర్ అసిరెడ్డి, కర్ణాకర్ మాధవరం పాల్గొన్నారు.

అలాగే ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు నరసింహారెడ్డి ధ్యాసాని, కాశీ కొత్త, రఘువీర్ మరిపెద్ది, రఘువీర్ రెడ్డి, శరత్ వేముల, శ్రీకాంత్ రెడ్డి గుడిపాటి, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కోఆర్డినేటర్ అమృతములపూడి సినీ నటుడు & కల్చరల్ అడ్వైజరి లోహిత్, కోఆర్డినేటర్ శశికాంత్, మీడియా కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected