Connect with us

Service Activities

నల్లమల సమీపంలోని గిరిజన ప్రాంత పేదలకు ATA ఆర్థిక సహాయం @ Telangana

Published

on

పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా (ATA) వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ (Telangana) లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో సేవాకార్యక్రమాలు నిర్వహించారు.

స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్ కు మొత్తం 25,000 రూపాయల ఆర్థిక సహాయం, వారికి వైద్య సేవలు అందేలా GOR Seva Club తో సమన్వయం, అలాగే మన్ననురు రేంజ్ కు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించింది. వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ… తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా (American Telugu Association) పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ తో చర్చించామని జయంత్ తెలిపారు.

ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని ఆటా (ATA) వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected